సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఎన్టీయార్ బయోపిక్  ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అంటేనే చంద్రబాబునాయుడు ఉలికిపడుతున్నారు. నేతలతో రోజువారిగా టెలికాన్ఫరెన్సులో  మాట్లాడే చంద్రబాబు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీస్ ఎన్టీయార్ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఎన్టాయర్ కొడుకు నందమూరి బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు అంటూ ఎన్టీయార్ బయోపిక్ ను తీశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన  మొదటిపార్టు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో శుక్రవారం రిలీజవుతున్న రెండో పార్టుపై జనాల్లో ఆసక్తి తగ్గిపోయింది.

 Image result for lakshmis ntr

అదే సమయంలో వర్మ తీస్తున్నలక్మీస్ ఎన్టీయార్ ట్రైలర్ నుండే సంచలనాలు సృష్టిస్తోంది. కొడుకు, చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు తీసిన ఎన్టీయార్ బయోపిక్ లో వాస్తవాలు ఎంత వరకూ చూపారన్నది అనుమానమే. ఎందుకంటే, ఎన్టీయార్ రాజకీయ జీవితంలో నిజమైన విలన్ చంద్రబాబే అన్న విషయంలో సందేహం లేదు. చంద్రబాబు వెన్నుపోటు కారణంగానే ఎన్టీయార్ పదవిని కోల్పోయి చివరకు మనస్ధాపంతో మరణించారు.

 Image result for lakshmis ntr

మరి బాలకృష్ణ తీసిన తండ్రి బయోపిక్ లో వెన్నుపోటు రాజకీయాలను చూపించే అవకాశాలు లేవు. పైగా చంద్రబాబు క్యారెక్టర్ ను పాజిటివ్ గా చూపే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్లలో కనబడుతోంది. అదే సమయంలో వెన్నుపోటులో ఎంతో కీలకమైన వైస్రాయ్ హోటల్ ఘట్టం, ఎన్టీయార్ కుటుంబంలో జరిగిన ఘట్టాలను వర్మ ట్రైలర్లో చూపించారు. దాంతో లక్ష్మీస్ ఎన్టీయార్ ట్రైవర్లే జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ పై చంద్రబాబు మండిపోతున్నారు. అదే విషయంలో టెలికాన్ఫరెన్సులో స్పష్టంగా కనబడింది.

 Image result for lakshmis ntr

టెలికాన్ఫరెన్సులో  ప్రత్యేకించి వర్మ తీస్తున్న బయోపిక్ గురించే మాట్లాడారంటేనే చంద్రబాబు పరిస్ధితేంటో అర్ధమైపోతోంది. పైగా వర్మ ఎన్టీయార్ చరిత్రను వక్రీకరించినట్లు చంద్రబాబు చెబుతున్నారు. ఎవరూ లక్ష్మీస్ ఎన్టీయార్ ను చూడొద్దనట్లుగా చెప్పటంలోనే  వాస్తవాలను జనాలకు తెలియకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్లు అర్దమైపోతోంది. మార్చి 7వ తేదీన లక్ష్మీస్ ఎన్టీయార్ గనుక రిలీజై చంద్రబాబు నిజస్వరూపం బయటపడితే ప్రజలు ఎలా రియాక్టవుతారో అన్న టెన్షన్ చంద్రబాబు కుదిపేస్తోందనటంలో సందేహం అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: