అక్కినేని నాగార్జున తనయుడి గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన అఖిల్ ఒక్క హిట్ కూడా కొట్ట లేకపోయాడు. తీసిన మూడు సినిమాలు ఫ్లాఫ్ టాక్ ను స్వంతం చేసుకున్నాయి. అవసరాల శ్రీనివాస్ హీరోగా ఎన్నారై అనే సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు క్లాప్ కొట్టడానికి అక్కినేని అమలను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఖాళీగా ఉన్నాడని అఖిల్ ను కూడా తీసుకెళ్లింది అమల. సరిగ్గా ఇక్కడే వ్యవహారం తేడాకొట్టింది. అమల క్లాప్ కొట్టడం మాట అటుంచి, అఖిల్ కు తలకొట్టేసినట్టయింది.

Image result for akhil akkineni

ఎన్నారై మూవీ ఓపెనింగ్ కు నాగబాబు, నాని, మంచులక్ష్మి ఇలా కొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ హడావుడిలో అఖిల్ ను ఎవరూ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా నాని వచ్చిన తర్వాత అఖిల్ పూర్తిగా పక్కకెళ్లిపోయాడు. కెమెరాలన్నీ నానిపైనే పడ్డాయి. అక్కడున్న జనాలంతా నాని చూట్టూరా చేరారు. దీంతో అఖిల్ కాస్త నవ్వుకుంటూనే వెనక్కి వెళ్లిపోయాడు. ఈ సీన్ లో అక్కడున్న చాలామంది మీడియా మిత్రులు అఖిల్ పరిస్థితి చూసి కాస్త నొచ్చుకున్నారు.

ఇంత ఘోరంగా ఉంటుందా అఖిల్!

కనీసం ఒక్క హిట్ ఉన్నా ఇప్పుడిలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. పేరుకు పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సక్సెస్ లేకపోతే ఇలానే ఉంటుంది మరి. అఖిల్ తనకు జరిగింది అవమానంగా ఫీల్ అయ్యాడో లేదో కానీ అక్కడున్న మిగతా జనాలు మాత్రం అఖిల్ కు చాలా పెద్ద అవమానం జరిగిందంటూ గుసగుసలాడుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అఖిల్ కు హిట్ చాలా ముఖ్యమని చెప్పి తీరాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: