ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఘడియ సమీపిస్తున్న సమయంలో రాజకీయాల్లో వేడి సెగలు మొదలయ్యాయి.  ఏపిలో ప్రముఖ పార్టీలు ఏ చిన్న ఛాన్స్ దొరికిన అపోజీషన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.  తాజాగా ఏపిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇటీవల చేసిన ప్రసంగంలో దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చింమనేని తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కావాలని అపోజిషన్ పార్టీవారు తను బ్లేమ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Image result for chintamaneni prabhakar
అంతే కాదు దీనిపై ప్రముఖ ప్రతిక, ఛానెల్ పై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.  తాజాగా ఈ వ్యవహారం పై స్పందించిన ఏపి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు..చింతమనేని ప్రసంగాన్ని ఎడిట్ చేసి, కొద్ది భాగాన్నే వైరల్ చేస్తూ, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 
Image result for ys jagan
చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? అని ప్రశ్నించారు. చింతమనేని ప్రసంగానికి వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారని, ఎవరైనా తమను అవమానిస్తుంటే ఈవిధంగా చేస్తారా? అని ప్రశ్నించారు.  కొంత కాలంగా రాజకీయ లబ్ది కోసం పదేపదే కుల ప్రస్తావన తెస్తూ ఏపీని అస్థిరపరచాలని చూస్తున్నారని జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రజలకు వారి కుట్రలు అర్థమైన రోజున చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: