ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో జగన్ పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. ఇన్నాళ్లూ మొత్తం 175 స్థానాలకు పోటీ చేస్తామంటూ చెబుతూ వచ్చిన జనసేన పార్టీ టీడీపీతో రహస్య ఒప్పందానికి రెడీ అవుతోందంటూ బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఇది ఏపీ పొలిటికల్ సర్కిల్లో షాకింగ్ న్యూస్ గా మారింది.



ఈ రెండు పార్టీలూ సాధారణ ఎన్నికల్లో మరోసారి కలసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయట. పొత్తులపై ఇప్పటికే ‘ఇద్దరు మిత్రులు’ మధ్య అంతర్గతంగా ప్రాథమిక అవగాహన కుదిరినట్లు ఆ పత్రిక తెలిపింది. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందానికి వచ్చాయట.




ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు రహస్యంగా భేటీ అయి ఈ దిశగా ఇప్పటికే చర్చలు సాగించినట్లు ఆ పత్రిక చెబుతోంది. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే సంఖ్యపై కూడా దాదాపు ఒక అవగాహనకు వచ్చారట. ఏయే స్థానాల్లో ఎవరిని పోటీకి నిలపాలన్న అంశాలపై కూడా లోతుగా చర్చించారట.

clip


ఐతే.. ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం..? ప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. మరి వారిని ఎలా ఒప్పించాలన్న కోణంలో ఆలోచిస్తున్నారట. ఇప్పటివరకూ వినిపిస్తున్న కేంద్రం, కేసీఆర్, జగన్ ఒక్కటయ్యారన్న వాదనను మరోసారి తెరపైకి తెచ్చి అందుకే మేం రాష్ట్రం కోసం కలుస్తున్నామని చెబుతారట. మరి ఈ కథనం ఎంతవరకూ వాస్తవమో.


మరింత సమాచారం తెలుసుకోండి: