వైస్సార్సీపీ అధినేత ను ఎప్పుడైతే ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ కలిశాడో ఒక్క సారిగా అందరూ దీని వెనుక ఎన్టీఆర్ ఉన్నాడని చాలా మంది చర్చించడం మొదలెట్టారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులు కానీ.. నందమూరి కుటుంబంతో బంధుత్వం ఉన్న వారు కానీ టీడీపీ కాకుండా ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసినప్పుడు విమర్శలు సహజమే. కానీ నార్నె శ్రీనివాస్ - జగన్ మీటింగ్ వెనుక ఎన్టీఆర్ ఉన్నాడని.. రానున్న ఎలెక్షన్స్ లో పోటీ చేసేందుకు టికెట్ కోసం వైసీపీలో చేరమనే సలహా మామగారికి ఇచ్చింది ఎన్టీఆరే అని రూమర్లు మొదలయ్యాయి.

Image result for jr ntr

ముఖ్యంగా తారక్ వ్యతిరేకులు ఈ ప్రచారం మొదలు పెట్టారు.  కానీ నార్నె వైసీపీ వైపు చూడడానికి.. ఎన్టీఆర్ కు అసలు ఏమాత్రం సంబంధం లేదని తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది.  ఎన్టీఆర్ కు.. మామగారికి మధ్య చాలాఏళ్ళ నుండి మాటలు లేవని..అలాంటప్పుడు నార్నె వైకాపా అధ్యక్షుడిని కలవడం విషయంలో ఎన్టీఆర్ కు ఏమాత్రం ప్రమేయం ఉండే అవకాశం లేదని వారు చెప్పుకొచ్చారు.

Image result for narne srinivasa rao

అప్పట్లో ఒక స్థలం విషయంలో ఇద్దరికీ విభేదాలు వచ్చాయట.. అప్పటి నుండి ఇప్పటివరకూ వారు ఒకరికొకరు దూరంగానే ఉంటున్నారట. కానీ ఎన్టీఆర్ అమ్మగారు షాలిని.. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి మాత్రం ఆయనతో మామూలుగానే ఉంటారట. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ పై లేనిపోని రూమర్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారో.. వాటివల్ల ఎవరికీ ఉపయోగమో ఎవరికి తెలుసు? 

మరింత సమాచారం తెలుసుకోండి: