ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి విజయావకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా వరుసగా టీడీపీ నుంచి ఆ పార్టీలోకి వచ్చిన వలసలు ఆ విషయాన్ని కొంతవరకూ రుజువు చేస్తున్నాయి.

సంబంధిత చిత్రం


వలసలకు తోడు అనేక సర్వేలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అంతే కాదు.. ప్రతిపక్షనేతకు ఆదరణ కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పెరుగుతోందని చెబుతున్నాయి. తాజాగా ఇండియా టుడే సర్వేను విశ్లేషిస్తే ఈ విషయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

సంబంధిత చిత్రం


ఇండియా టుడే సంస్థ గత సెప్టెంబర్ లోనూ సర్వే నిర్వహించింది. అప్పుడు జగన్ సీఎం కావాలని రాష్ట్రంలో 43 శాతం మంది కోరుకున్నారు. చంద్రబాబే సీఎం గా కొనసాగాలని 38 శాతం కోరుకున్నారు. అంటే వీరిద్దరి మధ్య తేడా 5 శాతం గా ఉంది. కానీ తాజాగా వచ్చిన సర్వేలో జగన్ కు మరో 2 శాతం అదనంగా ఆదరణ లభించింది.



ఈ సర్వేను ఫిబ్రవరిలో నిర్వహించామని ఇండియా టుడే చెబుతోంది. ఇప్పుడు జగన్ సీఎం కావాలని కోరుకునే వారి శాతం 45 గాఉంది. ఇక చంద్రబాబు ఆదరణ 2 శాతం తగ్గి 36గా ఉంది. అంటే వీరిద్దరి మధ్య గ్యాప్ కూడా 9 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో అర శాతం తేడాతో పదవి కోల్పోయిన జగన్.. ఇప్పుడు ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: