ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి వారి జోస్యానికి  తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు. అయితే మొన్న తెలంగాణా ఎన్నికల్లో ఫలితాలపై ఆయన వేసిన పిల్లి మొగ్గలు  చూశాక పూర్తిగా నమ్మకం తగ్గిపోయింది. అయినా సరే ఆయన తనదైన శైలిలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి జనాలకు తిప్పుకుంటూనే ఉన్నారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. లగడపాటి ముందు పొలిటీషియన్. తరువాతే ఆయన సర్వేశ్వరుడు. 


పోటీకి నొ  :


ఈ మధ్యకాలం వరకూ లగడపాటి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తెగ ప్రచారం అయింది. ఆయన సీటు కూడా ఖరారు అయిపోయిందని, విజయవాడ లేకపోతే ఎలూరు నుంచి బరిలోకి దిగుతారని కూడా అంటూ వచ్చారు. లగడపాటి సైతం తాను పోటీ చేస్తే ఎక్కడో ముందుగా మీడియాకు చెబుతానంటూ ఊరించారు. అయితే ఇపుడు అవన్నీ వట్టి వూహాగానాలుగా కొట్టిపారేస్తూ లగడపాటి వారే పక్కా క్లారిటీ ఇచ్చేశారు. లేటేస్ట్ గా నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తేల్చేశారు.


నమ్మకం  లేదా :


వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ జడ్పీటీసీ, టీడీపీ మహిళా నేత దగ్గుమల్లి భారతిని, శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ ఎంపీపీ పులిపాక థామస్‌ను, ఇటీవల మునగపాడు గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మైలవరం మాజీ సమితి ఉపాధ్యక్షుడు కోనా భిక్షమేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని ఆయన నిన్న  పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లగడపాటి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.


 దీంట్లోనే ఇపుడు అసలు విషయం ఉందని అంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్న లగడపాటికి ఏపీలో టీడీపీ విజయావకాశాలపై  నమ్మకం లేదా అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఏపీలో ఇపుడు సర్వేల సీజన్ నడుస్తోంది. బయటకు చెప్పకపోయినా లగడపాటి ఎప్ప్పటికపుడు సర్వేలు చేయిస్తూనే ఉంటారు అంటారు. మరో వైపు లేటెస్ట్ గా ఇండియా టుడే సర్వే సైతం వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన టైంలో లగడపాటి వారు పోటీ చేయనని చెప్పడం వెనక అర్దమేంటని లాజిక్ పాయింట్లు తీసే వారు కూడా ఉన్నారు. ఏపీలో టీడీపీకి గడ్డు పరిస్తితి ఉన్నందునే లగడపాటి పోటీకి దూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి చెప్పకుండానే లగడపాటి ఏపీలో టీడీపీ పొజిషన్ ఏంటన్నది చెప్పేశారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: