జగన్ రాజకీయం ఏంటన్నది టీడీపీ బూతద్దం పెట్టి చూస్తుంది. టీడీపీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక తన పార్టీతో పాటు, ఇతర పార్టీలలోని  రాజకీయాన్ని గమనించడం ఒక అలవాటుగా మారింది. ప్రత్యేకమైన నిఘా వ్యవస్థలను దాని కోసం ఆ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది కూడా. అక్కడ చీమ చిటుక్కుమంటే చాలు ఇక్కడ వేగుల ద్వారా తెలిసిపోతోంది.


అమరావతి నుంచే :


ఇక జగన్ ఇపుడు లండన్ టూర్లో ఉన్నారు. ఆయన ఈ నెల 26న  తిరిగి వస్తారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలు ఊపందుకుంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. గుంటూర్లో జగన్ కొత్తగా నిర్మించుకున్న సొంతిల్లు గ్రుహ ప్రవేశం ఈ నెల 27న జరుగుతుందని తెలుస్తోంది. ఆ మరుసటి రోజు నుంచి అమరావతి కేంద్రంగా వైసీపీ  అసలైన రాజకీయం మొదలవుతుందని అంటున్నారు. వరస జాయినింగ్స్ తో జగన్ పార్టీ మరింతగా గేరప్ అవుతుందని చెబుతున్నారు. ఈసారి భారీ ఎత్తున నేతల చేరికలతో ఫుల్ స్పీడ్ పెంచాలని జగన్ పార్టీ డిసైడ్ అయిందని టాక్.


తొలి జాబితా రెడీ ;


అదే విధంగా వైసీపీ తొలి జాబితాను రెడీ చేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు. ముందుగా వివాదాలు లేని చోట. సిట్టింగు ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను జగన్ విడుదల చేస్తారని అంటున్నారు. ఆ తరువాత పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు పాత వారి మధ్యన  సమన్వ్యయం చేసుకుంటూ గెలుపే ప్రధానంగా పనిచేయాలన్న సందేశాన్ని జగన్ ఇస్తారని అంటున్నారు. ఈ విధంగా ఆమోదం వచ్చిన చోట కొత్త వారికి కూడా టికెట్లు ఇస్తారని, అదే జోరులో ఏపీవ్యాప్తంగా  సమర శంఖారవం సభలు మరిన్ని నిర్వహించడం ద్వారా  ఎన్నికల ప్రచారాన్ని పీక్స్ కి తీసుకెళ్తారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ లండన్ టూర్ తరువాత వైసీపీ ఫుల్ బిజీ అవుతుంది. అలాగే రాజకీయాలను కూడా వేడెక్కిస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: