ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ఒంటికాలిపై లేస్తున్నారు. ఆయన్ను విమర్శించే అవకాశం ఎక్కడ దొరికినా వదిలిపెట్టడం లేదు. చివరకు తాను గతంలో సపోర్ట్ చేసిన అంశాలపై కూడా ఆయన యూటర్న్ తీసుకుని మరీ మోడీని తూర్పారబడుతున్నారు.

chandrababu on pulwama కోసం చిత్ర ఫలితం


అయితే మోడీని విమర్శించే క్రమంలో ఆయన విచక్షణ కోల్పోతున్నారేమో అనిపిస్తోంది. తాజాగా కశ్మీర్ లోనూ పుల్వామా దాడి ఇష్యూలో చంద్రబాబు చేసిన విమర్శలు ఆయన రాజకీయ అనుభవాన్ని సైతం తలదించుకునేలా చేస్తున్నాయి. దేశంలోనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఈవిషయంలో అంత సులభంగా ఎలా మాట జారారా అనిపిస్తోంది.

సంబంధిత చిత్రం

పుల్వామా లో తాము దాడి చేయలేదని పాకిస్తాన్ చెబుతోందంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన మాటలపై విమర్శల జోరు పెరిగింది. ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.

సంబంధిత చిత్రం


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాకిస్తాన్ ప్రధాన మంత్రిని ఎక్కువగా నమ్ముతున్నారని అమిత్ షా విమర్శించారు. రాజకీయాలకు కూడా హద్దు ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిని ఖండిస్తున్నానని ఆయన చెప్పారు కాని కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆయన ద్వజమెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: