మమత బెనర్జీ అక్క అట. చంద్రబాబు అన్న అట. వీళ్ళపార్టీల సభ్యులు తమ్ముళ్ళట. ఈ తమ్ముళ్ళే అధికారంలో ఉన్న పార్టీలకు ఊడిగం చేస్తూ ప్రజలను మోసంచేస్తూ సకల ప్రయోజనాలు పొందుతూ ఓటేస్తూ, వేయిస్తూ పార్టీ నాయకత్వాలకు వివిధ స్థాయిల్లో ప్రయోజనం కోసం పనిచేసే జనాలు కార్యకర్తలు అట. 
సంబంధిత చిత్రం
మొత్తం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేయకపోతే వీళ్ళ స్వప్రయోజనాలు నేరవేరవు. రాష్ట్రాలన్నింటా వ్యక్తి పాలన, కుటుంబ పాలన, వారసత్వ పాలన, కులపాలన, దీదీగిరి పేరుతో అక్కద రౌడీ ఇజం ఇక్కడ గుండాగిరి చేస్తూ రాష్ట్ర పాలన కొనసాగించటం చూస్తూనే ఉన్నాం. ఒక నాయకుణ్ణి సెంటిమెంట్ సృష్టించి ‘చాచా, అన్న, అక్క’ ఇలా పిలవాల్సిన పనేమిటి? 


మోడీ పాలనలో లేని ప్రజాస్వామ్యం వీరి రాష్ట్రాల్లో ఉందా? ఉంటే ఎలా ఉంది. ఒక రాష్ట్రంలో ప్రతిపక్షనేతపై హత్యా ప్రయత్నం జరిగితే అతనెలాంటివాడైనా ఆయనొక ప్రజాప్రతినిధి అన్న విషయం గమనించి సహృదయంతో స్పందించని ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యవాదని అనగలమా? రెండు పెద్ద కుంభకోణాలతో సంబంధమున్న సభ్యులున్న పార్టీ అధినేత్రి తన రాజధాని పోలీస్ కమీషనర్ ను కేంద్ర నిఘా సంస్థల విచారణకు అనుమతి నివ్వని ముఖ్యమంత్రి ఒక ప్రజాస్వామ్య ప్రతినిధి అవ్వగలరా? 
Indira Gandhi and Narendra Modi
దేశంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా, ఏవైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సమావేశాలు నిర్వహించుకోవటానికి ప్రయత్నిస్తే అనుమతుల పేరుతో అడ్డుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ముఖ్యమంత్రులే శాసనసభను వేదికగా చేసుకొని రాజకీయ ఉపన్యాసాలు దంచేయటం చూస్తూనే ఉన్నాం. స్వార్ధ ప్రయోజనాల పబ్బం గడుపు కోవటానికి ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చేయటం కొత్త రాష్ట్రానికి ఎంత ఆర్ధిన నష్టమో తెలిసినా ఆ నేరం చేసిన ఈ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమిస్తారా? 



ఈ పరిస్థితి ముఖ్యంగా మమత బెనర్జీ ముఖ్యమంత్రిత్వం వహించే పశ్చిమ బెంగాల్లో నిర్విరామంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది ఏ స్థాయిలో అంటే దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచి 19 రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా అధికారంలో ఉన్న బీజేపికి, అధినేత అమిత్ షాకు, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా బహిరంగ సభలకు అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి సేవ్ డెమాక్రసీ-సేవ్ నేషన్ అంటే ఎంతవరకు విశ్వసిస్థాం. దేశంలో ఆ దేశ ప్రధాని చేరలేని పబ్లిక్ ప్రదేశం ఉండవచ్చా? అలా ఉంటే అది ప్రజాస్వామ్యమా?
Opposition leaders at the swearing-in ceremony of Karnataka Chief Minister HD Kumaraswamy in Bengaluru on May 23
ఆమె దైహికబాషే ఆమెలో అంతర్గతంగా బహిర్గతంగా వై-ఫైలా ఆవరించిన నియంతృత్వాన్ని సూచిస్తుంది. ప్రజాభి ప్రాయాలు వెల్లడయ్యే సమావేశాలు నిర్వహించు కోవటానికి ఇబ్బందుకు సృష్టించే ఆమె ప్రజాస్వామ్యవాది ఎలా అవుతుంది? ఇలాంటి ‘పర్వర్టెడ్ పర్సనాలిటీస్’ ను ప్రజలు ముందుగానే గుర్తించి అధికారానికి సుదూరంలో నిలిపి వేయవలసిన అవసరం ప్రజా స్వామ్యరాజ్యంలో ఎంతైనా ఉంది.  



ఎల్లవేళలా ఎన్నికలలో గాని ముందుగా గాని వారి వారి సిద్ధాంతాలను అహింసాయుతంగా ప్రచారం చేసుకొనే హక్కు బహిరంగ సభలను నిర్వహించుకొనే హక్కు అన్నీ రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకుగాని నిర్ద్వంధంగా ఉంది. అదే జరగని నాడు ఆ రాష్ట్రంలో గాని ఆ దేశంలో గాని ప్రజాస్వామ్యం లేనట్లుగానే భావించాలి. 
mamata chandrababu కోసం చిత్ర ఫలితం

ఇక ఈ దేశాన్ని ఏక చత్రాధిపత్యంగా పాలించిన “న్రెహౄ-గాంధి రాచరిక కుటుంబ ఆధిపత్యంలోని  పాలన చత్రచ్చాయలో  బానిసల్లా బ్రతికేస్తున్న కాంగ్రెస్ పార్టీ - ఈ దేశానికి కాశ్మీర్ సమస్యను దేశం తలకొరివిగా రావణకాష్టంగా పెట్టింది. ఆ కుటుంబ పార్టీ అనేక స్కాముల హరివిల్లు. ఇప్పుడు ప్రియాంక గాంధి భర్త రాబర్ట్ వాధ్రా కూడా అనేక భూసంబంద కేసుల్లో, ఆర్ధిక నేరాల్లో ఇరుక్కొని ఉన్నాడు. ఆయన  సతీమణిగా ప్రియాంక గాంధి వాధ్రా ఈ దేశానికి చేసింది ఇప్పటి వరకేమీ లేదు. ఇందిరా గాంధి రూపు రేఖలు తప్ప ఆమె నుంచి ఆశించేదేమీ లేదు  కాకపోతే,  కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే "నెహౄ-గాంధి కుటుంబం"  కాస్తా  "నెహౄ - గాంధి - వాధ్రా  కుటుంబం"  అవుతుంది అంతే తేడా!  

nandamuri nara dynasti కోసం చిత్ర ఫలితం

వీళ్ళంతా - వీళ్ళతో పాటు ఆర్ధిక నేరాల్లో బెయిలుపై ఉన్న లాలు ప్రసాద్ అండ్ ఫామిలీ - మూలాయం సింగ్ అండ్ ఫామిలీ నుండి కుప్పలు తెప్పలుగా ఉన్ననేతలు, మాయావతి అనే అవినీతి కేసుల్లో ఇరుక్కొన్ననేత - కలసి ఈ దేశానికి సమర్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తారట ఇది సాద్యమా? ఈ బిజేపి ఏతర కాంగ్రెస్ టిఎంసి నాయకత్వ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని పదవి అధికారం కోసం రోజూ కుక్కల కాట్లాట సినిమా మనమంతా చూడటం తధ్యం.    
mamata dynasty కోసం చిత్ర ఫలితం

mamata dynasty కోసం చిత్ర ఫలితం

మమత, చంద్రబాబు రాష్ట్రాల్లో జరిగిన ఆర్ధికనేరాల్లోనూ - ప్రియాంక భర్త రాబర్ట్ వాధ్రా ఆర్ధిక సంబంద నేరాలు, మనీ లాండరింగ్ కేసుల్లోనూ- సోనియా గాంధి రాహుల్ గాంధిల ప్రమేయము న్న నేషనల్ హెరాల్డ్ కేసు, అనేక రంగు రంగుల స్కాములలో కేంద్ర విచారణ సంస్థలు ప్రశ్నిస్తే బిజెపిపై ఎదురుదాడి చేయటం ఒక ఆనవాయితీగా మారింది.  కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తే పోయేదేముంది - వీరు నేరాలు చేయకపోతే నిరూపణ జరగదుకదా!  అలాంటప్పుడు కేంద్రం గాని విచారణ సంస్థలు కాని చేయగలిగేది ఏమీ ఉండదు. మీలో లోపాలు లేకుంటే మీరింత వణికి పోవటమెందుకనేది విశ్లేషకుల ప్రశ్న.  ధారుణమైన ఆర్ధిక రాజకీయ సామాజిక నెరాలు చేస్తూ అధి కారంలో కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని రాచరిక కుటుంబ వంశపారంపర్య  పాలనగా మార్చేసుకున్న ఈ బిజేపీ ఏతర ఫ్రంట్ లు చేసే మేలు కటే కీడే ఎక్కువ.   


కశ్మీర్ లోని పుల్వామాలో భారత ఆర్మీ వాహనశ్రేణి పై జరిగిన ఆత్మాహుతి దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని మార్గంలోనే పాకిస్తాన్ ను సమర్థిస్తూ మాట్లాడటం విశేషం. ఈ దాడిలో పాకిస్తాన్ సైన్యం సరఫరా చేసిన ఆర్డీఎక్స్ ను వాడినట్టుగా భారత సైన్యం ధ్రువీకరించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టుగా ఆర్మీ గుర్తించింది. ఇందుకు బాధ్యత తమదే అని జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది కూడా.
nehru gandhi dynasty కోసం చిత్ర ఫలితం
అయితే ఇందులో రాజకీయకోణం ఉందని చంద్రబాబు, మమతా వంటి వాళ్లు అంటున్నారు. ఈ ఘటనలో పాకిస్తాన్ బాధ్యత లేదని  ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. చంద్రబాబు, మమతా,  బెనర్జీ, నవజ్యోత్ సింగ్ సిద్ధు, మహబూబా ముఫ్తి లాంటి వాళ్లు కూడా అదే మాట వల్లెవేస్తున్నారు. పాకిస్తాన్ కు ఈ ఘటనకు సంబంధం లేదని వీరు చెబుతున్నారు. పాకిస్తాన్ వాదన తో వీరు ఏకీభవిస్తున్నారు.


ఒకవైపు ఈ సంఘటన గురించి భారత సైన్యం పూర్తి ధర్యాప్తు చేసింది. సూత్రధారులు ఇద్దలిద్దరిని హతం చేశారని  కూడా ప్రకటించింది. ఈ విధమైన అంశం గురించి మమతా, చంద్రబాబు లాంటివాళ్లు పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తూ ఉండటం గమనార్హం.
mamata chandrababu కోసం చిత్ర ఫలితం
పుల్వామా అటాక్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వీరు అంటున్నారు. పరోక్షంగా నరేంద్ర మోడీనే ఈ దాడి చేయించాడు అన్నంత బాషాజాలం ఉపయోగిస్తున్నారు. నరేంద్ర మోడీతో చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయ విరోధం ఉంటే ఉండొచ్చు కానీ, మరీ ఇంతలా పాకిస్తాన్ వాదనను బలపరుస్తూ మాట్లాడటం మాత్రం దారుణంగానే కాదు ఆయన చిత్తశుద్ధిని శంఖించేలా ఉంది. దేశమా? అధికారమా? అంటే అధికారమే ముఖ్యం అనే ముఖ్యమంత్రుల తీరు అన్ని వేళలా జాతికి ప్రమాదమే కదా! 


"పదవి రుచి మరిగిన వాడి పెళ్ళాం, పక్కింటివాడితో లేచిపోయి, ఎదురింట్లో కాపురం పెట్టినా, సహిస్తాడేమో గాని - పదవి పోతే బరించలేడు" ఇది మహానటుడు నందమూరి తారక రామారావు "పెత్తందార్లు" సినిమాలోని డయలాగ్. మన రాజకీయ నాయకుల బుద్ధిహీనతను మహోన్నత నటుడు నాగభూషణం తనకే స్వంతమైన శైలిలో పలికిన తీరు, కనబరచిన భావం హృద్యమం. 


ఇక వీళ్ళకు దేశం దేశభక్తి లాంటి వాటి అర్ధం సెంటిమెంట్ లాంటివి ఉండకపోవచ్చు. 

NTR Chandrababu dynasty కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: