డబ్బు సంపాదించడమే పరమావధిగా భావిస్తున్న కొంత మంది నీచుటు యువతను టార్గెట్ చేసుకొని డ్రగ్స్ దందా నడుపుతూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు.   దేశ వ్యాప్తంగా డ్రగ్స్ అమ్మాకాలు విపరీతంగా పెరిగిపోతున్నారు.  మహానగరాల్లో యువతను డ్రగ్స్ బానిసలుగా చేస్తున్నారు.  ఆ మద్య హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే.  ఈ డ్రగ్స్ దందాలో సినీ, రాజకీయ వ్యక్తులు ప్రమేయం ఉందని తెగ వార్తలు వచ్చాయి. 

సిట్ కొంత మంది సినీ పరిశ్రమకు చెందిన వారిని కూడా ఇంటరాగేషన్ చేశారు.  తాజాగా హైదరాబాద్ సోమాజీగూడలో ఘనా దేశానికి చెందిన మహిళ డ్రగ్స్‌తో పట్టుబడింది. గోవా నుంచి కొకైన్‌ను తీసుకొస్తున్న జెనీవే ఆల్టో అనే మహిళను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పట్టుబడ్డ మహిళ నుంచి 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియాను స్వాధీనం చేసుకున్నారు.
drugs makes headlines in hyderabad .. students being targeted
జెనీవే  నుంచి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్ మాఫియా ఆదేశాలతోనే ఆమె వాటిని సరఫరా చేసేందుకు హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే ఈ డ్రగ్స్ ఆమె ఎవరెవరికి సప్లై చేయడానికి వచ్చిందీ..ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: