ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామంటూ.. తెలంగాణలోని అధికార పార్టీ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆయ‌న అలా అన్నా త‌ర్వాత కాలంలో ఏపీలోని అధికార పార్టీలో అనేక ప్ర‌కంప‌న‌లు చోటు చేసు కుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు జంప్ చేస్తున్నారు. అయితే, వారు వెళ్తున్న రీజ‌న్ ఒక‌టైతే.. వారు చెబుతున్న కార‌ణం మ‌రొక‌టిగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోటీడీపీ సీటు ద‌క్క‌నివారు మాత్ర‌మే పార్టీలు మారుతున్నార‌నేది వాస్త‌వం. అయితే, ఇలా మారుతున్న వారు మాత్రం అసలు విష‌యాన్ని క‌నుమ‌రుగు చేసి.. కొస‌రు విష‌యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 


ఇక‌, ఇప్పుడు ఏకంగా తూర్పుగోదావ‌రిలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు సాగుతున్నాయి. తెలంగా ణాకు చెందిన కీల‌క మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌.. ఇటీవ‌ల ఏపీలో ఎక్క‌వగా ప‌ర్య‌టించిన విష‌యం తెలి సిందే. అయితే, ఆయ‌న ఇక్క‌డి రాజ‌కీయ నేత‌ల‌తో ముఖ్యంగా టీడీపీలో ఉన్న కొంద‌రు ముఖ్య నేత‌ల‌కు పుల్ల‌లు పెట్టే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. వారిని ఏదో ఒక విధంగా టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేయ‌డం త‌ల‌సాని ముఖ్య ధ్యేయం. త‌ర్వాత కాలంలో వారు గెలుస్తారా?  లేదా? అస‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తుందా?  రాదా? అనేది ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబుపై కుట్ర ప‌న్నుతున్న రాజ‌కీయాల‌కు తెర‌దీశారు 


ఈ క్ర‌మంలోనే కాకినాడ ఎంపీగా, టీడీపీపీ నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఎంతో గౌర‌వించిన నాయ‌కుడు తోట న‌ర‌సింహం. అలాంటి నేత ఇప్పుడు చంద్ర‌బాబు విజ‌న్‌కు విరుద్ధంగా కోరిక‌ను తెర‌మీదికి తెచ్చాడు. తూర్పుగోదావ‌రిలో వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలోకి వ‌చ్చిన జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌గ్గంపేట నియ‌జ‌క‌వ‌ర్గం టీడీపీ టికెట్‌ను త‌న స‌తీమ‌ణికికోరారు తోట న‌ర్సింహం. వాస్త‌వానికి ఇక్క‌డ నెహ్రూకు ఎక్కువ బ‌లం ఉంది.

ఆయ‌న ఇట్టే గెలిచే ఈ సీటునుఎవ‌రికీ ఇవ్వ‌రాద‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. అయితే, ప‌ట్టుబ‌ట్టిదీనిని అడిగేలా త‌ల‌సాని ఒత్తిడి పెంచారు. ఇది ఎలాగూ ఇవ్వ‌రు కాబ‌ట్టి ఈ మిష‌తో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా రంగం సిద్ధం చేశారు.ఇ క‌, ఇక్క‌డ బ‌ల‌మైన మ‌రో నేత తోట త్రిమూర్తులు విష‌యంలోనూ త‌ల‌సాని చ‌క్రం తిప్పుతున్నాడు. ఇలా మొత్తానికి ఏపీలో వేలు పెడ‌తున్న తెలంగాణ మంత్రికి గ‌ట్టి షాక్ ఇచ్చేలా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: