ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధికార టీడీపీ అలెర్ట్ అయింది. రాజ‌ధాని ప్రాంత జిల్లా గుంటూరులో టీడీపీ గెలుపు గుర్రాలు పోటీకి సిద్ధ‌మ‌య్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఓటును, ప్ర‌తి సీటును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. ప్ర‌తి ఒక్క అభ్య‌ర్థి జాత‌కాన్ని ఒక‌టికి ప‌ది సార్లు వ‌డ‌బోసి మ‌రీ టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి టికెట్లు ఇచ్చేందుకు కూడా ఎలాంటి మొహ‌మాటం లేకుండా చంద్ర‌బాబు తిర‌స్క‌రిస్తున్నారు.తాజాగా గుంటూరు జిల్లాకు సంబంధించి చంద్ర‌బాబు రేసుగుర్రాల లిస్టును విడుద‌ల చేశారు. ఈ జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగే చాలామంది అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. ఇక్క‌డ నుంచి పెద్ద త‌ల‌కాయ‌లే రంగంలో ఉండ‌డం విశేషం.


జిల్లాలో మొత్తం  17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అదేవిధంగా 3 పార్ల‌మెంటు స్థానాలున్నాయి. వీటికి చంద్ర‌బాబు దాదాపు అభ్య‌ర్థుల విష‌యంలో ఖ‌రారు చేసుకున్నారు. ఎంపీ సీటు విష‌యంలో ఒక్క న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సిట్టింగుల‌నే ఖ‌రారు చేశారు.  ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే.. సిట్టింగుల‌కే చంద్ర‌బాబు దాదాపు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగుల‌ను క‌ద‌ప‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ వారి విజ‌యం ఎన్నిక‌ల‌కు ముందుగానే ఖరారైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే ప‌నితీరు. ప్ర‌జ‌ల్లోవారికి ఉన్న సానుకూల‌త వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వీరిలో చాలా మంది గ‌తంలో క‌న్నా భారీ మెజారిటీతో విజ‌యం సాధించేందుకు అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే తెలుస్తున్న స‌మాచారం. 


నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఖ‌రారైన ఎంపీలు
గుంటూరు ఎంపీ - గ‌ల్లా జ‌య‌దేవ్‌
బాప‌ట్ల ఎంపీ- శ్రీరాం మాల్యాద్రి
------------------------
నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఖరారైన ఎమ్మెల్యేలు
వినుకొండ - జీవీ ఆంజ‌నేయులు
గుర‌జాల - య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు
చిల‌క‌లూరిపేట‌- ప్ర‌త్తిపాటి పుల్లారావు
పొన్నూరు- ధూళ్లిపాళ్ల న‌రేంద్ర‌
తెనాలి - ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్‌
వేమూరు- న‌క్కా ఆనంద‌బాబు


మరింత సమాచారం తెలుసుకోండి: