వాట్సాప్ భారతీయుల చేతిలో సమాచార వారధిగా మారిపోయి రోజురోజుకూ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉచిత కాల్స్, మేస్సేజీలను ఆఫర్ చేస్తుండడంతో వాడకం అధికంగా పెరిగిపోయింది. వినియోగదారులదకు ఆకట్టుకునే క్రమంలో వాట్సాప్‌ ఎన్నో రకాల ఆలోచనలతో   కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.  అయితే అందరికీ ఉపయోగపడాల్సిన వాట్సాప్ ను కొంత మంది ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్నారు.  భయభ్రాంతులకు గురయ్యేలా వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు షేరు చేస్తు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారు. 
Image result for వాట్సాప్‌ యూజర్ల కఠిన శిక్ష
దాంతో కొంత మంది వాట్సాప్ ఉపయోగించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.  దీనికి దృష్టిలో పెట్టుకొని వాట్సాప్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) అవకాశాన్ని కల్పించింది.  అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలను, లేదా  కంటెంట్‌ను షేర్‌ చేసే చెక్‌ చెప్పేలా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఇబ్బందులకు గురి అయ్యే బాధితులు తమకు ఫిర్యాదు చేయవొచ్చని  శుక్రవారం సంబంధిత అధికారి ప్రకటించారు. అశ్లీల, అసభ్యకరమైన వీడియోలు పంపి బెదిరించే కస్టమర్లు డిక్లరేషన్‌  ఫాంలో అంగీకరించిన నిబంధనల ఉల్లంఘనకు కిందికి వస్తుందని తెలిపింది.
Image result for whatsapp misuse jail
అలాంటి యూజర్స్ పై  వెంటనే చర్యలు తీసుకోవాలని దేశంలోని  అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు  ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.  అలాంటి వాట్సాప్‌ సందేశాలను  అందుకుని వుంటే ccaddn-dot@nic.in కు  ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని  డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే రుజువు కోసం వాటికి సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ ఫిర్యాదును సంబంధిత టెలికాం ప్రొవైడర్లతోపాటు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటామని జోషి వెల్లడించారు. అంతే కాదు ఇలాంటి అభ్యంతర పోస్ట్ లకు ఊతం ఇస్తున్న ప్రొవైడర్ల లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.  గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఇలా దుర్వినియోగం చేసే వాట్సాప్ మెసేజ్  ఎక్కువ కావడం..సెలబ్రెటీలకు, జర్నలిస్టులకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెలికాం విభాగం ఈ చర్యలు చేపట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: