తిరుపతిలో తారకరామ మైదానంలో కాంగ్రెస్‌ భరోసా యాత్ర నిర్వహించిన సందర్భంగా బహిరంగ సభలో “రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ” అని స్పష్టం చేశారు.  
rahul gandhi in tirupati కోసం చిత్ర ఫలితం

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటికి రాహుల్‌ నివాళి అర్పించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ ‘‘మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. ప్రత్యేక హోదా కేవలం ప్రధాని ఇచ్చిన వాగ్దానం కాదు దేశంలోని ప్రతిపౌరుడు ఏపీకి ఇచ్చిన వాగ్దానంగా భావిస్తున్నాం. ప్రధాని ఒక వ్యక్తి కాదు  కోట్లాది మందికి ప్రతినిధి, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రత్యేక హోదాను అడ్డుకోలేదు’’ అని రాహుల్ చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీలా మాట తప్పమని ఏ శక్తి కూడా ప్రత్యేక హోదాను అడ్డుకోలేదన్నారు. ఇది 125మంది కోట్ల ప్రజల తరపున ఇస్తున్న హామీగా భావించాలన్నారు రాహుల్. విభజన హామీలను కూడా కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. శుక్రవారం తిరుపతి తారకరామ మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ భరోసా యాత్ర బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. 
rahul gandhi in tirupati కోసం చిత్ర ఫలితం
తన మనసులో మాట చెప్పడానికే తిరుపతి వచ్చానన్నారు రాహుల్. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది ఒక్క వ్యక్తి కాదని.. 125 కోట్లమంది ప్రజల గొంతుకగా ఉండే ప్రధాని అంటూ గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. ఇది దేశంలో ఉన్న ప్రతి పౌరుడి తరపున ప్రధాని ఇచ్చిన వాగ్థాన మన్నారు. ప్రధాని ఓ మాట చెప్పారంటే.. అది ప్రజలంతా చెప్పినట్లే అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ హమీ మన్మోహన్, నరేంద్ర మోదీ ఇచ్చింది కాదు దేశం ఇచ్చిన హామీ అని గుర్తు పెట్టుకోవాలన్నారు. 


ప్రత్యేక హోదాను అమలు చేయనందుకు ప్రధాని మోదీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్. ‘ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, ఐదుకోట్ల మందికి హామీ ఇస్తున్నా ప్రత్యేక హోదా ఇస్తాం’ అంటూ భరోసా ఇచ్చారు. ఐదేళ్ల క్రితం నరేంద్ర మోదీ తిరుపతిలో ఇదే మైదానంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఐదేళ్లు కాదు పదేళ్లు అమలు చేస్తామని చెప్పిన మాటను రాహుల్ గుర్తు చేశారు. ‘పవిత్రమైన తిరుమల ఆలయానికి వెళ్లొచ్చా, స్వామిని దర్శించుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తాం’ అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంబంధం లేదు కాంగ్రెస్ హోదా అమలు చేసి తీరుతుంద న్నారు. 

rahul gandhi in tirupati కోసం చిత్ర ఫలితం

"ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా - కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చెస్తే ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం" అని రాహుల్ గాంధి అన్నారు. అంటే ఆయన కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్ప లేక పోతున్నారు అన్నమాట.  ఏపిలో తెలుగుదేశం అధికారంలోకి రాదనేనా రాహుల్ గాంధి నమ్మకమే అలా మాట్లాడించిందా! 


ఏపీలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనో, వైసిపిని ఓడించాలనో రాహుల్ గాంధి ప్రకటించలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ప్రత్యేక హోదా ఇస్తామని అన్నాడు. తద్వారా చంద్రబాబును గెలిపిస్తేనే ప్రత్యేక హోదా, అనే ఆణిముత్యం రాహుల్ గాంధి నోట వెలువడింది అంటే ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకి రాహుల్ గాంధి ఝలకే ఇచ్చాడు ఎలాగూ టీడీపీ గెలిచే పరిస్థితి లేదనే రాహుల్ గాంధి ఇలా మాట్లాడి ఉంటారనే విశ్లేషణలు విరివిగా వినిపిస్తున్నాయిప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: