తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తాజాగా దృష్టిసారించారు. ఎన్నికల్లో గెలిచాక నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్కువగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడిన కెసిఆర్ మొన్నటివరకు దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను కలిశారు కెసిఆర్.

Image result for kcr

అయితే ఇటీవల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కెసిఆర్ తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీని ప్రకటించారు.

Related image

బడ్జెట్ లో ఆయన ఈ విషయం తెలిపారు. 2018 డిసెంబర్‌ 11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్ల నిదులను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Image result for kcr

రైతుబంధు పధకం కింద ఎకరానికి ఏడాదికి అందించే మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచింది. అలాగే రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించింది. అలాగే రైతు రుణామఫీ కోసం రూ.6వేలు కేటాయించింది. దీంతో తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎంతగానో సంతోషించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: