ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణకు ఎపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 16 ఆగస్టు 2017న నిర్వహించిన రోడ్‌ షోలో ఓటర్లకు బాలకృష్ణ డబ్బులు పంచారంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కె.శివకుమార్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ap High Cour Issues Notices to actor Balakrishna
ఓటర్లకు బాలకృష్ణ డబ్బుల పంపకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. తాజాగా  ఈ పిటీషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బాలకృష్ణకు  బెంచ్.. గతంలో ఏమైనా నోటీసులు జారీ చేశారా? అని ప్రశ్నించింది. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, కర్నూలు జాయింట్ కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేదని చెప్పడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కర్నూలు కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: