ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథానాయకుడు సినిమాకు కనీసం మంచి రివ్యూలైనా వచ్చాయి. మహానాయకుడు సినిమా ఆ భాగ్యానికి కూడా నోచుకోలేదు. ఇది ఎన్టీఆర్ బయోపిక్కా.. చంద్రబాబు బయోపిక్కా అని చూసిన వాళ్లు నోరు వెళ్లబెడుతున్నారు.



చంద్రబాబును అడుగడుగునా హీరోగా చూపించిన ఈ సినిమా కనీసం ఎన్టీఆర్ అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఈ సమయంలో ఈ సినిమా చూడాలంటూ చంద్రబాబు ప్రమోషన్ ప్రారంభించారు. పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.



తెలుగుదేశం ఆవిర్భావం ఎదుర్కొన్న సంక్షోభాల పై తీసిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు అని.. నేటి తరానికి ఎన్టీఆర్ అంటే ఏంటో తెలిపే సినిమా అని చంద్రబాబు చెబుతున్నారు. పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి రావడం ఓ సంచలనమని.. తెలుగోడు ఢిల్లీని గడగడలాడించిన తీరు అందరికీ ఆదర్శమని నేతలకు సెలవిచ్చారు చంద్రబాబు.



ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మనకి స్ఫూర్తి అంటున్న చంద్రబాబు.. మహానాయకుడు సినిమా ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. విద్యార్ధులు, యువతరం తప్పకుండా చూడాలని.. ఎన్టీఆర్ ఆదర్శాలను తెలుసుకోవాలని అంటున్నారు చంద్రబాబు. మరి ఇప్పటికే చతికిలపడ్డ మహానాయకుడు.. బాబు ప్రమోషన్ తో పుంజుకుంటారా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: