ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ స‌ర్దు కుంటున్నారు. గెలుపు గుర్రాలుగా ఉన్న నాయ‌కుల కు పార్టీలు సైతం టికెట్ల‌ను ఖ‌రారు చేస్తున్నాయి. కీల‌క పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఇప్ప‌టికే వ్యూహా్త్మ‌కంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యాయంగా ఆయా పార్టీలు ముందుకు సాగుతు న్నాయి. ఎక్క‌డా ఎలాంటి రాజీ ప‌డ‌కుండా ముందుకు సాగుతున్నాయి. ఇక‌, నాయ‌కులు కూడా త‌మ త‌మ రాజ‌కీయ నేప థ్యంలో పార్టీల వెతుకులాట‌.. కుర్చీల కోట్లాట‌లో మునిగి తేలుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌డిచిన రెండు మాసాల కింద‌ట భారీ ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేసిన మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్ప‌టికీ అగ‌మ్య గోచ‌రంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.


విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న నాయ‌కులు వంగ‌వీటి కుటుంబం. ఈ ఫ్యామిలీకి చెందిన వంగ‌వీటి రాధాకృష్ణ‌... 2004లో విజయ‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న కాంగ్రె స్‌ను విడిచి పెట్టి ప్ర‌జారాజ్యంలోకి చేరారు. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా రాధాను ఒంట‌రిని చేసేసింది. 2009 ఎన్నిక‌ల్లో రాధా ఓడిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన స‌మయంలో పార్టీతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, ఆ స‌మ‌యంలో కొత్త‌గా పార్టీ పెట్టి న వైసీపీలోకి చేరిపోయారు. అయితే, ప్ర‌స్తుత ఎన్నిక‌ల సమ‌యంలో ఆయ‌న జ‌గ‌న్‌తో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీతో జ‌ట్టుకు సిద్ధ‌మ‌య్యార‌నే ప్ర‌చారం సాగింది.


అయితే ఇక్క‌డ జ‌గ‌న్‌కు, రాధాకు మ‌ధ్య చెడిపోయిన విషయం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం. ఈ టికెట్ను త‌న‌కు ఇవ్వ‌మ‌ని రాధా అడుగుతుంటే.. దీనికి బ్రాహ్మణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణుకు ఇచ్చారు. దీంతో ఇక‌, రాధా బ‌య‌ట‌కు రావ‌డం త‌ప్ప మ‌రోమార్గం లేక‌పోయింది. అయితే, అదేసమ‌యంలో టీడీపీలో కూడా ఈటికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమాకే క‌న్ఫ‌ర్మ్ అయింది. దీంతో ఇప్పుడు రాధా టీడీపీలోకి వెళ్లినా.. ఆయ‌న మ‌న‌సులో కోరిక మాత్రం తీరేలా క‌నిపించ‌డం లేదు. లేక టీడీపీని ప‌క్క‌న పెట్టి జ‌న‌సేన‌లోకి వెళ్లే ఆలోచ‌న చేస్తే మాత్రం ఖ‌చ్చితంగా సెంట్ర‌ల్ సీటు ఇప్పించుకోగ‌లిగితే.. గెలిచే స‌త్తా కూడా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి రాధా మార్గం ఎటో ఏమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: