తిరుపతి సభలో రాహుల్ ప్రసంగం అంతగా జనాలను ఆకట్టుకోలేదని చెప్పాలి. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ ను ఇరకాటం లో పడేశాయి.  బాబుగారి ప్రతిభా పాఠవాలు తెలంగాణ ఎన్నికల సమయంలోనే రాహుల్ కి అర్థమయ్యాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల పోస్ట్ మార్టమ్ లో నేతలంతా టీడీపీ పొత్తుపైనే నిందలేశారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో చంద్రబాబే పొత్తు వద్దని చెప్పడంతో రాష్ట్రంలో పోటీకే నిర్ణయించింది కాంగ్రెస్.

Image result for rahul gandhi

అయితే టీడీపీ గెలుపుపై రాహుల్ గాంధీకి నమ్మకంలేదని తిరుపతి సభతో తేలిపోయింది. ఎన్నికల తాయిలం కాదని చెప్పడానికే ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు రాహుల్. వైసీపీ వచ్చినా తమ హామీ నెరవేరుతుందని పరోక్షంగా భరోసా ఇచ్చారు. ఏపీలో అధికార పార్టీ మరోసారి అధికారంలోకి రాదనే అర్థం వచ్చేలా రాహుల్ మాట్లాడారు. సర్వేల ఫలితాలన్నీ వైఎస్సార్సీపీకే పట్టంకట్టడం, ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు ఇస్తే వారికే మద్దతిస్తామని జగన్ స్పష్టం చేయడంతో రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.

టీడీపీ ఓటమిని రాహుల్ గాంధీ అంచనా వేశారా..?

మీకు ప్రత్యేకహోదా ఇస్తాం, మీ రాష్ట్రంలో ఎవరు ఎంపీలుగా గెలిచినా వారి మద్దతు మాకివ్వాలి అనేది రాహుల్ కండిషన్. రాహుల్ గాంధీ సభ ఒకరకంగా టీడీపీని ఇరకాటంలో పడేసింది. కేంద్రంలో రాసుకుపూసుకు తిరిగిన చంద్రబాబుని, ఆయన ఢిల్లీలో చేసిన దీక్షని, కేంద్రం రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేస్తుందనే విషయాలను ఒక్కసారికూడా ప్రస్తావించని రాహుల్ గాంధీ టీడీపీ గాలితీసేశారు. వైసీపీకి ఓ గాలమేసి ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: