క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయాలని అనుకుంటున్నారట. గంటా తాజా ఆలోచనలకు కారణాలేంటి ? ఏమిటంటే, వైసిపి తరపున అవంతి శ్రీనివాస్ పోటీ దాదాపు ఖాయం కావటమే అంటున్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో భీమిలీలో పోటీ గంటా-అవంతి మధ్య జరుగుతుంది.


ఈమధ్యనే టిడిపికి రాజీనామా చేసిన అనాకపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ వైసిపిలో చేరారు. అవంతి కూడా గంటా లాగే అంగ, అర్ధబలంలో గట్టివాడే. పైగా గంటాకన్నా అవంతికే క్రెడిబులిటీ ఉంది. గంటాయేమో అందిరినీ కెలికేస్తుంటాడు. అవంతేమో తన పనేదో తాను చేసుకుపోయేరకం. కాబట్టి గంటాతో పోల్చుకుంటే అవంతికి వ్యతిరేకులు తక్కువ.

 

ఎప్పుడైతే భీమిలో తన ప్రత్యర్ధి అవంతి అని గంటాకు అర్ధమైందో వెంటనే ప్లాన్ మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. అవంతిని ఢీ కొనటం కష్టమని గంటా అంచనా వేసుకున్నారు. దాంతో  రాబోయే ఎన్నికల్లో పోటీ భీమిలీ నుండి విశాఖపట్నంపై దృష్టి పెట్టారట. అయితే, విశాఖ సీటుపై బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ ఇప్పటికే కర్చీఫ్ వేశారు. అందులోను సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి మనవడు. కాబట్టి టికెట్ విషయంలో ధీమాతో ఉన్నారు.  మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: