ఈ మద్య బెంగుళూరు ఎయిర్ షో  వరుసగా అపశృతులు దొర్లుతున్నాయి. బెంగుళూరు ఎయిర్ షో వద్ద కారు పార్కింగ్ స్థలం వ్యాపించిన మంటలు..15 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది.  ప్రతి సంవత్సరం బెంగుళూరు ఎయిర్ షో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. కానీ రిహాల్సల్ సమయం నుంచి ఎదో ఒక అపశృతి చోటు చేసుకుంటూనే ఉంది.

మొన్న ఎయిర్ షోలో ఆకాశంలోనే రెండు ఎయిర్ క్రాప్ట్ ఢీకొనడం..ఒక పైలెట్ మృతి చెందడం జరిగింది. ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.  నేడు మూడో రోజు షో లో ఒక్కసారే పార్కింగ్ ఏరియాలో సుమారు 60 నుంచి 100 వరకు కారు ఇంజన్లో మంటలు వ్యాపించి దగ్ధమైనట్లు తెలుస్తుంది.   ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పర్యాటలకు ఒక్కసారే భయబ్రాంతులకు గురై చెల్లా చెదురు అయ్యారు. 

ప్రమాదం జరగడంతో నిలిచిపోయిన ఏరో ఇండయా -2019 షో. అయితే ఇది కేవలం నిర్లక్ష్యంతోనే జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అక్కడ ఎండు గడ్డి ఉండటం..బహుషా ఎవరైనా స్మోక్ చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే ఏరో షో వద్ద ఉన్న అగ్నిమాపక  అప్రమత్తం కావడం 15 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: