ఇప్పటికే పలు సర్వేలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరు అధికారం లోకి రాబోతున్నారని తేల్చేశాయి. అన్ని పార్టీలు అధికార పార్టీ కి పరాభవం తప్పదని చెప్పాయి. ఈహతే ఇప్పుడు మరో సర్వే కూడా టీడీపీ కి ప్రతికులంగా వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆ చానల్ సర్వేను పూర్తిచేసింది. అందులో ఒకింత షాకింగ్ రిజల్ట్సే వచ్చాయని తెలుస్తోంది. ఆ సర్వే  ఫలితాలను ముందుగా.. అధికార పార్టీతో ఆ చానల్ పంచుకున్నట్టుగా తెలుస్తోంది.

Image result for chandra babu

ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో నూటా నలభై అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే పరిస్థితి ఉందని, తెలుగుదేశం పార్టీ పాతిక, ముప్పై అసెంబ్లీ సీట్లకు పరిమితం కానుందని .. తమ సర్వేలో తేలినట్టుగా సదరు మీడియా వర్గం అధికార పార్టీ వారికి వివరించిందట. మీడియా మేనేజ్ మెంట్ లో పండితుడు అయిన చంద్రబాబు నాయుడు.. ఆ సర్వే వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయవద్దని గట్టిగా అడిగాడని సమాచారం.

Image result for chandra babu

ప్రస్తుతానికి ఆ సర్వే వివరాలను ప్రసారం చేయవద్దని.. ఇటీవలే తాము కొన్ని సంక్షేమ పథకాలను అమలు పరిచామని.. వాటితో పరిస్థితి మారుతుందని.. కాబట్టి.. ఇప్పుడు మళ్లీ సర్వేను చేసుకుని కావాలంటే వివరాలను ప్రసారం చేసుకోవచ్చని బాబు చెప్పారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూటా నలభై అసెంబ్లీ  సీట్లు నెగ్గుతుందనే సర్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయవద్దని.. కొంత విరామం తీసుకుని.. మళ్లీ సర్వేను చేయాలని.. అప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చినా వాటిని ప్రకటించుకోవచ్చని.. అప్పుడు తమకు ఏ అభ్యంతరం ఉండదని.. సదరు చానల్ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: