ఉత్తరప్రదేశ్‌ లోని భాదోహి ప్రాంతంలో ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందగా.. మరో ముగ్గురు గాయడ్డారు.  భవనంలో టపాసులు ఉంచడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. క్రాకర్స్‌కు మంటలు అంటుకోవడంతో.. భారీ విస్ఫోటనం జరిగినట్టు తెలుస్తోంది. ఈ భారీ విస్ఫోటనం దాటికి రెండంతస్థుల బిల్డింగ్‌తో పాటు మరో మూడు ఇళ్లు కూడా కుప్పకూలిపోయాయి. 
భారీ పేలుడు - 10 మంది మృతి 
మృతుల్లో దుకాణం నడుపుతున్న కలియార్ మన్సూరి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. షాపు వెనుకాలే ఆయన కుమారుడు కార్పెట్ ఫ్యాక్టరీ ఒకటి నడుపుతున్నాడని, శిథికాల కింద చిక్కుకున్న వారిలో ఆ షాపు వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.  రెండస్తుల భవనంలో కార్పెట్లను తయారు చేసే కంపెనీ ఉండగా.. ఇందులోనే అక్రమంగా ఫైర్ క్రాకర్లను కూడా తయారు చేస్తున్నట్టు ప్రాధమికంగా గుర్తించామని భాదోహి ఐజీ పియూష్‌ శ్రీవాస్తవా తెలిపారు.
up-expoision
అయితే పుల్వామా దాడుల తర్వాత మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో… ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిపారు.  ఫోర్సెనిక్ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సహాయక కార్యక్రమాల కోసం క్రేన్లను రంగంలోకి దింపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: