ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా స్పీడందుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ మరో పదిహేను రోజుల్లో వెలువడుతున్న వేళ ప్రధాన పార్టీల్లో హడావుడి మామూలుగా లేదు. ఓ వైపు ఎన్నికల వ్యూహాలు, మరో వైపు అభ్యర్ధుల ఎంపికలు, ఇంకోవైపు ప్రత్యర్ధులపై ఘాటు విమర్శలు, రేపటి ఎన్నికల్లో ఎంచుకోవాల్సిన నినాదాలు ఇవన్నీ కలసి ఏపీకి వేసవి వేడిని ముందే తెచ్చేశాయి.


టీడీపీ ముందుందా :


ఇక అభర్ధుల సెలెక్షన్లో టీడీపీ ముందుందా అనిపిస్తోంది. ఆ పార్టీ ఈసారి సీమ వైపు  నుంచి నరుక్కురావడం విశేషం. రాయలసీమలో జగన్ బలాన్ని తగ్గించినట్లైతే ఎన్నికల్లో లాభం పొందవచ్చునని చూస్తోంది. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తి అయిందని తెలుస్తోంది. ఇక్కడ ఎంపిక ఓ విధంగా సులభమే. ఎందుకంటే ఆ పార్టీకి పోయిన ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చాయి. దాంతో ఇక్కడ సిట్టింగుల ఫిట్టింగులు లేవు. వీలైనంత వరకూ ఇతర పార్టీల నుంచి అభ్యర్ధులను తెచ్చుకోవడం, వైసీపీని వీక్ చేయడం ఇలా సాగుతోంది వ్యూహం. మొత్తానికి దాదాపు వంద సీట్ల వరకు క్లారిటీతో టీడీపీ ఉందని అంటున్నారు.


వైసీపీ వెనకబడిందా :


మరో వైపు వైసీపీ తీరు చూస్తే ఇంకా చేరికలే అన్నట్లుగా  ఉన్నాయి. అక్కడ ఆ పార్టీ ఆగినట్లుగా కనిపిస్తోంది. జగన్ సరైన సమయంలో లండన్ టూర్ పెట్టుకున్నారు. ఆయన వచ్చాక మరిన్ని చేరికలు ఉంటాయని అంటున్నారు. దాంతో అపుడు అభ్యర్హ్దుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక జగన్ కొత్త ఇల్లు అమరావతికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు. అక్కడ నుంచి ఆయన అభర్ధుల సెలెక్షన్ ఉంటుందని చెబుతున్నారు. పాత కొత్త అభ్యర్ధుల మధ్య పొరపచ్చాలు లేకుండా ఎంపిక చేయడం జగన్ కి కత్తి మీద సామే మరి. మొత్తానికి ఎన్నికల వేడి ఎక్కడ ఉంది అంటే ఏపీలోనే అని చెప్పుకోవాలేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: