ఇప్పుడు మీడియా రాజకీయపార్టీల కొమ్ముకాస్తూ కులాలకు కాంట్రాక్టర్లకు కాపుకాస్తున్నాయి. ఒక్కో మీడియా హౌస్ ఒక్కో  రాజకీయ పార్టీకి ప్రచారసాధనంగా మారిపోయాయి. వాటి ఇంటి కి కపలాకుక్కల స్థాయికి దిగజారాయి. 

political parties and media in AP కోసం చిత్ర ఫలితం

మన డబ్బుతో మనం కొనుక్కున్న టెలివిజన్, వార్తాపత్రికలు సరైన సమాచారం, పాఠకులకు సమాజ అవగాహన, విద్యావిషయ సాంస్కృతిక సాంకేతిక ఆధ్యాత్మిక అవ గాహన కలిగించే విషయాలు అందించక-ఎవరో కొందరి స్వార్ధప్రయోజనాలకు రాజకీయంగా వారి గెలుపుకు ఉపయోగపడటం, వారి పదవులకు సంబంధించిన మోసాలు కపటాలు దాచిపెడుతూ ప్రజలకు అంతా అద్భుతంగా ఉన్నట్లు చూపటం రాయటం మన దురదృష్టం, హృదయవిదారకం. అందుకే ప్రజల్లో ఇప్పుడు ఈ సమాచార వాహిని పట్ల (మీడియా) ద్వేష భావన రగిలి పోతోంది.

 chandrababu & national media management కోసం చిత్ర ఫలితం

అందుకేనేమో గడిచిన కొన్ని మాసాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ సెర్చ్  ఎక్కువగా చేసిన విషయాలు ఏమంటే!


హౌ టు కంట్రోల్ టీవీ ఛానెల్స్,

హౌ టు కంప్లైంట్ ఎగెనస్ట్ టీవీ ఛానెల్స్?


దీన్నిబట్టి టీవీ ఛానెల్స్ అంటే ప్రజలకు ఎంత అసహ్యం, జుగుప్స, ద్వేషభావం కలుగుతున్నాయో తెలుస్తుంది. టీవీ ఛానెల్స్ పై గాని జర్నలిస్టుపై గాని ధౌర్జన్యాలు చేసినా, పత్రికా విలేకరులను కొట్టినా, జనంలో ఎలాంటి ప్రతిస్పందన లు లేకపోవటం  దానికి మించి తెగ ఆనంద పడిపోవటం చూస్తుంటే మీడియా ఎంత అరాచక శక్తిగా తయారైందో ఊహించు కోవచ్చు. ఫ్రజల ద్వేషాగ్ని వారి మనసుల్లో ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

రాజ్యాంగం నిర్వచించక పోయినా జనం మీడియా అంటే రాజ్యాంగ నాలుగవ స్తంభంగా భావిస్తూ-ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగశక్తిగా ఊహించుకున్నారు. కానీ రాను రాను మీడియా ఒక అనుమతించిన ప్రభుత్వేతర నేఱ వ్యవస్థ లేదా లైసెన్సెడ్ ప్రైవేట్ మాఫియా గా మారిపోయింది.  నేఱత్వం నరనరాన నిండినదని కొందరు భావించే పోలీసువ్యవస్థ కన్నా, ఈనాడు మీడియా మరింత దుర్మార్గంగా ధౌర్జన్యంగా దురాగతాల నిలయంగా తయారైంది.

political parties and media in AP కోసం చిత్ర ఫలితం

ఇంకా రాజకీయ నాయకుల మీడియా మానేజ్మెంట్ ఉండనే ఉంది. దానికి ఉదాహరణగా ఈ మద్యే ఏపి రాజకీయ అధినేత ఒక జాతీయ మీడియా పాదాలు పట్టుకున్నంత  సంఘటన చెప్పుకోవచ్చు. 


మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి ఇటీవలే ఒక చానల్ ఒక మోడల్ సర్వేను ప్రసారం చేసింది. కేవలం పర్సెంటేజీల వారీగా కొన్ని సంఖ్య్హలను చెప్పింది. అసెంబ్లీ, లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరగబోయే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టుగా సదరు చానల్ కేవలం చూచాయగా చెప్పింది.

chandrababu media management కోసం చిత్ర ఫలితం

ఆ సంగతలా ఉంటే, మరో జాతీయ ఇంగ్లిష్ వార్తా చానల్ ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి తన అధ్యయనాన్ని చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆ చానల్ సర్వేను పూర్తి చేసింది. అందులో చంద్రబాబుకు షాకింగ్ రిజల్ట్సే వచ్చాయని తెలుస్తోంది.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

ఆ సర్వే ఫలితాలను ముందుగా, అధికార పార్టీతో ఆ చానల్ పంచుకున్నట్టుగా తెలుస్తోంది.

 ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో నూటనలభై అసెంబ్లీ స్థానాలు వైసిపి అత్యధిక ఆధిఖ్యతతో గెలిచే పరిస్థితి ఉందని, తెలుగుదేశం పార్టీ పాతిక, ముప్పై అసెంబ్లీ సీట్లకు పరిమితం కానుందని, తమ సర్వేలో తేలినట్టుగా సదరు మీడియా వర్గం అధికార పార్టీ వారికి వివరించిందట.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

మీడియా మేనేజ్మెంట్ లో మహాపండితుడు అయిన చంద్రబాబు నాయుడు ఆ సర్వే వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయవద్దని గట్టిగా అడిగాడని సమాచారం.

ప్రస్తుతానికి ఆ సర్వే వివరాలను ప్రసారం చేయవద్దని, ఇటీవలే తాము కొన్ని సంక్షేమ పథకాలను అమలు పరిచామని వాటితో పరిస్థితి మారుతుందని కాబట్టి ఇప్పుడు మళ్లీ సర్వేను చేసుకుని కావాలంటే వివరాలను ప్రసారం చేసుకోవచ్చని బాబు చెప్పారట.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

వైసిపి నూటనలభై అసెంబ్లీ  సీట్లు నెగ్గుతుందనే సర్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయవద్దని  కొంత విరామం తీసుకుని మళ్లీ సర్వే చేయాలని అప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చినా వాటిని ప్రకటించుకోవచ్చని అప్పుడు తమకు ఏ అభ్యంతరం ఉండదని సదరు చానల్ ప్రతినిధులకు చంద్రబాబు చెప్పారట.


చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్క్రిల్స్ తెలిసిన విషయాలే. దీంతో ఆ చానల్ సదరు సర్వే ప్రసారాన్ని ఆపేసిందని ఇప్పుడు మళ్లీ మరో సర్వేను మొదలు పెట్టినట్టుగా మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.

chandrababu media management కోసం చిత్ర ఫలితం 

ప్రధానంగా 2004 నుంచి తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ ఛానెల్స్ కల్చర్ మొదలైన తర్వాత మీడియా పూర్తి స్థాయి మాఫియాగా అవతరించింది. 70లు, 80లు, 90ల్లో మీడియా రాజకీయ పార్టీలకు కొమ్ము కాయడం, సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికే పరిమితమై ఉండేది.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

న్యూస్ ఛానెల్స్ పెట్టిన తర్వాత ప్రధానంగా చిల్లర జర్నలిస్టులు, రియల్టర్లు, లిక్కర్ కాంట్రాక్టర్లు, బ్రోకర్లు 25, 30 కోట్ల తో న్యూస్ ఛానెల్స్ పెట్టడం స్టార్ట్ చేసి, ఒక్కసారిగా ఛైర్మన్లు, ఎండీలుగా రూపాంతరం చెంది నప్పటి నుంచీ ప్రజలకు మీడియా కష్టాలు మొదలయ్యాయి. ఒక్కొక్క ఛానెల్ కు రెండు మూడొందల మంది స్ట్రింగర్లు, న్యూస్ పేపర్ కు 1500పైగా కంట్రిబ్యూటర్లు, గ్రామ గ్రామాన విస్తరించి, ఒక చిన్న అక్రిడేషన్ కార్డుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, డబ్బులు వసూలు చేసుకెళ్లి పోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, మున్సిపల్ ఉద్యోగులకంటే ముందు స్ట్రింగర్లు వచ్చి వాలిపోతారు. మాకేమైనా ఇస్తావా? ఇవ్వవా? లేదంటే రాసేయమంటావా అని భయపెడ తారు. ఇక షాపులు, హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారులు, వీటితో పాటు పొలిటీషియన్లు సంగతి చెప్పనే అక్కర్లేదు. వీళ్ల దగ్గర నెలవారీ వసూలు చేసేది ఒక్క మీడియా వాళ్లు మాత్రమే.

 

ఇది కింది స్థాయిలోఇక పైస్థాయిలో కాంట్రాక్టర్లు, పొలిటీషియన్లు, పార్టీలతో కుమ్మక్కై పోవడం, తామే అన్ని వ్యవస్థ ల్నీ కంట్రోల్ చేయడం, ఇలా పూర్తిగా గడిచిన పదేళ్ల కాలంలో, ఒక ఇరవై న్యూస్ ఛానెల్స్ రెండు రాష్ట్రాల్లో ఒక మాఫియా సామ్రాజ్యంలా విస్తరించాయి. ఆరు నెలల నుంచి తెలుగులో న్యూస్ ఛానెల్స్ ప్రవర్తిస్తున్న తీరు చూసి, ప్రజలు వాటిపై ఉమ్మేస్తున్నారు.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితం

ప్రపంచంలో ఇంకే సమస్యాలేనట్టు, కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టడం, ఏడెనిమిది గంటలు సుదీర్ఘ చర్చలు పెట్టించడం, జనం టీవీలు చూసి బాబోయ్! అమ్మోయ్! అని గుండెలు బాదుకుంటున్నా, ఛీ కొడుతున్నా, న్యూస్ ఛానెల్స్ తీరు మారలేదు.


నోరు మూసుకుని మేం ఏం చూపిస్తే అవే చూడండి, అనే స్థాయికి చేరిపోయాయి న్యూస్ ఛానెళ్లు. ప్రజలకు ఏం కావాలో సామాజిక జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో, ఇవేమీ అక్కర్లేదు. శ్రీరెడ్డి, కత్తి మహేష్, పనికిమాలిన మాజీ నటుడు శివాజీ ఉంటే చాలు. రోజులు, నెలల వారీగా రకరకాల అంశలపై చర్చలు పెట్టేస్తారు. ప్రజాజీవితాలు ఎలా ఉండాలో వీళ్లు శాసించేస్తారు. మేము ఇలాగే చూపిస్తాం, నోరు మూసుకు చూడండి అంటారు. ఎందుకు న్యూస్ ఛానెళ్లకు ఇంతటి దురహంకారం? ఇంత బరితెగింపు? మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడనే అహంకారం?

kcr media కోసం చిత్ర ఫలితం

namaste telangana kcr కోసం చిత్ర ఫలితం

15నుంచి 20కోట్లతో నలుగురు కలిసి ఒక ఛానెల్ పెట్టడం, ఆ మైకులగొట్టాలు పట్టుకుని ఊళ్ల మీద పడిపోవడం, పిండారీలు, దగ్గులు కంటే దారుణంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో జనాన్ని దోచుకుతినడం మామూలై పోయింది. ప్రజలకు మేలు చేయకపోగా, ఒక మాఫియా వ్యవస్థలా తయారైన మీడియాను జనం ఛీత్కరించు కుంటున్నారు.

chandrababu & ABN Radhakrishna కోసం చిత్ర ఫలితంఅసలు 12కోట్ల మంది తెలుగువాళ్లకు గట్టిగా నాలుగు ఛానెల్స్ ఉంటే సరిపోతుంది. డబ్బులున్నాయి కదా అని, ఛానెల్స్ పెట్టేసి, రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయి, అటు ప్రభుత్వాల్ని, ఇటు ప్రజల్ని శాసించే స్థాయికి చేరిపోయాయి న్యూస్ ఛానెల్స్.

jagan media కోసం చిత్ర ఫలితం

ఈరోజు సమాజానికి రౌడీ షీటర్లు, గూండాలు, పోకిరీల కంటే మీడియా వల్ల జరుగుతున్న హానే చాలా ఎక్కువ. అందుకే జనం మీడియా అంటే అసహ్యించుకుంటున్నారు, ఛీత్కరిస్తున్నారు.


ఇక ఒక్కో మీడియా న్యూస్ చానల్ ఒక్కో పార్టీ రంగు సంతరిచుకొని ఆ పార్టీ అధినేతల గురించి బాకా ఊదుతూ వారి తనయుడు మనవడు మునిమనవడు చివరికి వాడి బారసాల నుండి చడ్ది కట్టుకునే కార్యక్రమాల వరకు ఎపిసోడ్లకు ఎపిసోడ్లు కృమ్మరిస్తూ జనాన్ని చంపేస్తున్నారు.


ఇక నాయకులకు వారి కులాలకు మతాలకు వ్యాపారాలకు కాంట్రాక్టులకు సమాచారం ప్రచారం ఇస్తూ ఇతరుల విషయాలను చపేసే సేవలు చేస్తూ ఇవి తరిస్తున్నాయి.

jagan vs sakshi కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: