ఏ ఏటికి ఆ ఏడు ఎన్నికలలో మార్పు వస్తోంది. ఎన్నికలు అంటే ప్రజలను మెప్పించడం, ఇపుడు అందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏదో విధంగా ఈవీఎం మీట మీద తన గుర్తుకు ఓటేయించుకోవడమే నేతాశ్రీల లక్ష్యం  అయిపోయింది. అందుకోసం ఏమైనా చేసేలా కనిపిస్తున్నారు. ఇపుడు అసలైన  గేమ్  స్టార్ట్ అయింది.


వైసీపీలో అలా :


ఇపుడున్న పరిస్థితులు చూస్తూంటే వైసీపీలోకి  నేతలు ఓ రేంజిలో క్యూ కడుతున్నారు. జగన్ లండన్ టూర్ నుంచి వచ్చాక పెద్ద మొత్తంలోనే జంపింగ్ జఫాంగులు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తారని అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి లాభంతో పాటు నష్టం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు టీడీపీ జాబితా విడుదల అయ్యాక మిగిలిన ఆశావహుల చూపు కూడా వైసీపీ మీద పడబోతోంది. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ కిటకిటలాడడం ఖాయంగా ఉంది. మరి ఉన్న వారి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంటి.


గొడవలు ముదిరితే :


పాతవారు, కొత్త వారి మధ్యన గొడవలు ముదిరితే అది అసలుకే ఎసరు తెస్తుంది. అపుడు బలం కాస్తా వాపు అవుతుంది. మరి ఈ విషయంలో ఇప్పటికే అనేక జిల్లాలో గొడవలు రేగుతున్నట్లుగా న్యూస్ వస్తోంది. కర్నూల్ జిల్లా పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి కొత్తగా పార్టీలోకి వచ్చిన కాటసాని రామిరెడ్డికి గొడవ జరుగుతోంది. ఆమె పార్టీని వీడుతానని అంటున్నారు. మరి దీన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ వైసీపీ పెద్దలకు ఉందా.


జగన్ మార్క్ పాలిటిక్స్ ;


సరిగ్గా ఇక్కడే జగన్ చేయాల్సింది చాలా ఉంది. ఎటూ అధికారంలోకి వస్తున్నారన్న సంకేతాలు ఉన్న వేళ జగన్ పాత వారికి, కొత్తవారికి కలుపుకుని ఉంచాల్సిన నేర్పుని ప్రదర్శించాలి. . పూర్వం మాదిరిగా పోతే పోతారు అన్న తీరులో వ్యవహరించరాదు, రాబోయే  ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకమే. అందువల్ల ఓ నాయకుడు బయటకు పోతే ఇంపాక్ట్ చాలా ఉంటుంది.  ఇప్పటికైతే జగన్  ఈ విషయంలో గతానికి భిన్నంగా వ్యవహ‌రిస్తున్నారని అంటున్నారు. ఆయన సర్దుబాట్లు చేస్తూ నేతలందందరికీ భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. జగన్ ఇదే తీరున పార్టీలో నేత‌లను కలుపుకుంటూ ముందుకు పోతే అది టీడీపీకి గట్టి షాకే మరి. వైసీపీ గొడవలనే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో లాభపడాలన్న ఆ పార్టీ ఎత్తులు చిత్తు అయినట్లే. మరి జగన్ మార్క్ పాలిటిక్స్ ఇక్కడే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: