ఎన్నికలు అంటే అందరికీ ఆసక్తి. ఎందుకంటే ఈ క్రీడలో ప్రతీ ఒక్క ఓటరూ పాల్గొని భాగస్వామి అవుతాడు. అలా కాలేని వారు తమ అభిమతాన్ని ఓ పార్టీతో అభిమానాన్ని లింక్ చేసుకుని గెలుపు కోసం చూస్తూంటారు. మొత్తానికి  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికలు అంటే ఎవరికైనా అమితాసక్తే. ఇక కౌన్ బనేగా ఏపీకా పతి అన్నదే ఇపుడు అందరికీ ఉన్న ఉత్కంఠ.


అలా చెప్పేస్తున్నారా :


నిన్న కాక మొన్న ఏపీకి రాహుల్ గాంధి వచ్చారు. తిరుపతి సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి  వస్తే ఏం చేస్తామో చెప్పుకున్నారు. పనిలో పనిగా మోడీని విమర్శించారు. అన్నీ చెప్పేసిన ఆయన చివరాఖర్లో  మాత్రం ఓ పంచ్ డైలాగ్ వదిలారు. ఏపీలో రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను తాము తప్పక నిలబెట్టుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. దీని భావమేమి తిరుమలేశా అనుకుంటూ టీడీపీ నాయకులు ఇపుడు మల్లగుల్లాలు పడుతున్నారు.
రాహుల్ తో డిల్లీలో చేయి కలిపిన చంద్రబాబుకైతే రాహుల్ మార్క్ పంచ్ డైలాగ్ అసలు అంతు పట్టడం లేదు. మిత్ర పక్షమైన  కాంగ్రెస్ అంచనా అలాగుంది మరి అంటే ఏపీలో రేపటి ఎన్నికల్లో వైసీపీ వస్తుందన్న ఆలోచనలు రాహుల్ కి ఉన్నాయని అలా తేలిపోయింది కదా  మరి.


కేటీయార్ ఇలా :


ఇక పక్కననున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా, అకక్డ అధికారంలో ఉన్న టీయారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నిన్నటికి నిన్న తాపీగా ఓ మాటనేశారు. అదేమంటే ఏపీలో వచ్చేది కచ్చితంగా జగన్ అని. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమైంపోయిందని, ఎన్నికలు పెట్టడమే ఇక తరువాయి అన్నట్లుగా కేటీయార్ మాట్లాడారు. టీడీపీ చిత్తుగా ఓడిపోతోందని, కేవలం చంద్రబాబు  చేతగానితనం వల్లనే టీడీపీ ఓటమి పాలు అవుతోందని కూడా అసలు విషయం చెప్పేశారు. ఇవన్నీ ఇలా ఉంటే జాతీయ నేతలు చాలా మందికి కూడా ఏపీలో రాజకీయం అర్ధమవుతోంది. 


బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా కేసీయార్తో మంతనాలు జరుపుతున్నారు.ఇతర నాయకులు సైతం ఎందుకైనా మంచిదని ఏపీలో వైసీపీ మీద ఓ కన్నెసి ఉంచారు. కాంగ్రెస్ కూడా మునుపటి శత్రుత్వం వైసీపీ మీద చూపడం లేదు. దీని అర్ధం అందరికీ తెలుస్తోంది. కానీ అర్ధం కానీ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క  టీడీపీ మాత్రమే. ఆ పార్టీకి అన్నీ కుట్రల్లా కనిపిస్తున్నాయి. కేసీయార్, మోడీ, జగన్ని కలిపి తిడుతున్న టీడీపీ తమ్ముళ్లకు రాహుల్ గాంధి తిరుపతిలో వేసిన పంచ్ వినిపించినా  తెలియనట్లుగా నటించడమే పెద్ద విశేషం. 


అలాగే మమతా బెనర్జీ కేసీయార్ కి ఫోన్ చేస్తూంటే కూడా వీరికి మమతలో మోడీ కనిపించడం లేదు. దీన్నేమనుకోవాలి. దబాయింపు కబుర్లతో మరో మారు అధికారం లోకి వద్దమనుకుంటే కుదిరే రోజులా ఇవి. అంతా సోషల్ మీడియా మహిమ. పసుపు తమ్ముళ్ళు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తే ఇంకా ఎలా. వాస్తవాలు గమనించాలిగా. 2014 తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఇపుడు ముగ్గురు మోడీలు అంటున్నారు. బాగానే ఉంది కానీ జనం నమ్ముతారా. ఎందుకంటే రెండు పార్టీలతో జత కట్టిన చరిత్ర అచ్చంగా చంద్రబాబుదాయే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: