ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి పగుళ్లిచ్చింది. గతంలోనూ ఓసారి ఇలాంటి పగుళ్లే వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆరోడ్డుని మరమ్మత్తు చేశారు. కాకపోతే అప్పుడు పగుళ్లు వచ్చింది పోలవరానికి వెళ్లే రోడ్డులో.



ఇప్పుడు ప్రాజెక్టు స్పిల్ వే రెస్టారెంట్ సమీపంలో భూమిలో ఒక్కసారిగా పగుళ్లు వచ్చాయి. దీంతో డ్యామ్ నిర్మాణాన్ని సందర్శించేందుకు వచ్చిన సందర్శకులు, ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. పగుళ్లను పూడ్చే పనిలో పడ్డారు.

POLAVARAM DAM BREAKING కోసం చిత్ర ఫలితం


మట్టిలో తేమ శాతం తగ్గినప్పుడు ఇలాంటి పగుళ్లు ఏర్పడుతుంటాయని అక్కడ ఓ ఇంజినీర్ మీడియాకు వివరించారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా పేలుళ్లు జరిపినప్పుడు వదులుగా ఉన్న భూమి కుంగి పగుళ్లు ఏర్పడతాయన్నారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

POLAVARAM DAM WORKS LATEST కోసం చిత్ర ఫలితం


కొంతకాలంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం చూపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉచిత వాహనాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. మరి జనం ఇలాంటి పగుళ్లు చూసి ఎలా స్పందిస్తారో..


మరింత సమాచారం తెలుసుకోండి: