కడప జిల్లా లో వైస్సార్సీపీ పార్టీ తరుపున నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యే గా గెలిచాడు. అయితే మరి ఘోరంగా టీడీపీలోకి జంప్ అయ్యాడు. ఆదినారాయణ రెడ్డిపై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకు ప్రధాన కారణం ఫిరాయింపు. ఏనియోజకవర్గం ప్రజలూ హర్షించని రాజకీయం ఫిరాయింపు. జమ్మలమడుగులో అయితే.. అలాంటి పనిచేసినందుకు ఆది మీద ప్రత్యేకమైన కోపం కూడా కనిపించింది ప్రజల్లో. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఆది నిలబడి ఉంటే.. ఆయనను జనాలు చిత్తుగా ఓడించేవారు.

Image result for adi narayana reddy

రెండువేల నాలుగు నుంచి వరసగా ప్రతిసారీ ఓటమిని మూటగట్టుకుంటూ వచ్చారు రామసుబ్బారెడ్డి. దీంతో ఈసారి సానుభూతి అస్త్రాన్ని రామసుబ్బారెడ్డి వాడే అవకాశం ఉంది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి జమ్మలమడుగులో డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి పోటీచేయడం ఖరారు అయ్యింది. ఇక ఇక్కడ విజయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Image result for jagan

జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలో వైఎస్‌ కుటుంబానికి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుని ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవడానికి జగన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఇక్కడ ప్రతి మండలానికీ ఒక కీలకమైన నేతను ఇన్‌చార్జిగా నియమించినట్టుగా తెలుస్తోంది. వైఎస్‌ వివేకానందరెడ్డికి  ఒక మండలాన్ని అప్పగించారట. వేరే మండలాలకూ కూడా జగన్‌ ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించినట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: