ఆయన ఏపీకి ప్రతిపక్షనేత.. కానీ పాదయాత్ర, ఇతర సమయాల్లో తప్ప కనిపించేది ఎక్కువగా హైదరాబాద్ లోనే. ఆయన నివాసం లోటస్ పాండ్ లో.. ఇటీవల ఆ పార్టీలోకి చేరికలు ఎక్కువగా జరిగింది ఈ లోటస్ పాండ్ లోనే. అందుకే టీడీపీ దీన్ని కూడా విమర్శించింది.

సంబంధిత చిత్రం


ఇక ఈ ఇబ్బందులు జగన్ కు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన అమరావతిలో నిర్మించుకున్న వైసీపీ పార్టీ ఆఫీసు కమ్ ఇంటిలోకి త్వరలోనే వచ్చేస్తున్నాడు. ఫిబ్రవ‌రి 27వ తేదీన బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు కొత్త చిరునామాలోకి మారుతున్నారు. ఈ నివాసం మంగ‌ళ‌గిరి మండ‌లంలోని, తాడేప‌ల్లిలో ఉంది. ఇప్పటికే గృహప్రవేశం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

jagan mangalagiri house కోసం చిత్ర ఫలితం


నూత‌న‌ పార్టీ కేంద్ర కార్యాల‌యము మ‌రియు గృహ ప్రవేశము కోసం ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. మీడియాకు కూడా ఆహ్వానాలు వచ్చేశాయి. ఈ కార్యక్రమంలో భాగ‌స్వాములై తమ ఆతిధ్యం స్వీక‌రించవ‌ల‌సింది అంటూ ఆ పార్టీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేరుపై ఆహ్వానాలు అందాయి.

jagan mangalagiri house కోసం చిత్ర ఫలితం


ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ రాక కోసమే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారనే కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక ఏదేమైనా జగన్ ను కలవాలంటే పక్క రాష్ట్రం వెళ్లాల్సిన ఇబ్బంది నాయకులకు ఉండకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: