టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా దేశంలోనే పేరు. ఇపుడు చురుకుగా ఉన్న పాతతరం దేశ నేతల్లో ఆయన ఒకరు. ఎంతో అనుభవం కలిగిన బాబు ఓ విధంగా వర్తమాన రాజకీయ నాయకులకు స్పూర్తిగా ఉండాల్సిన వారు. దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. అలాగే  కాల మాన పరిస్థితులు కూడా మారుతున్నాయి.

 

పట్టలేని ఉక్రోషం :

 

బాబు ఇపుడు పోటీ పడుతున్నది నవీన తరంతో. జగన్ అందులో నుంచి వచ్చిన వారే. జగన్ తండ్రి వైఎస్ కాలం నాటి పోటీలో ఉన్న చంద్రబాబు ఇపుడు ఆయన కొడుకుతో కూడా రాజకీయం చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఇది బాగానే ఉన్నా బాబు మాత్రం తన ఆలోచనలను ఇంకా పాతకాలంలోనే ఉంచేసుకున్నారు. తాను హై టెక్ అంటున్నారు కానీ ఆయన భావజాలం మాత్రం ఎక్కడో ఆగిపోయింది. ప్రజాస్వామిక విధానాల్లో ఎవరి నైనా పోటీదారులుగానే భావించాలి. కానీ బాబు మాత్రం శత్రువు కంటే ఎక్కువగా రాజకీయ ప్రత్యర్ధులను భావిస్తున్నారు. ఇది ఓ విధంగా పెత్తందారి పోకడలను ప్రతిబింబిస్తోంది. తాను ఒక్కరే రాజకీయ మైదానంలో ఉండాలని, తనతో పోటీ పడేందుకు ఎవరూ ఉండరాదని బాబు భావించడం దారుణం.

 

వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు ;

 

బాబు తనలోని ఆవేశాన్ని, అసహనాన్ని ఎక్కడా దాచుకోలేకపోతున్నారు. తన రాజకీయ అనుభవం అంత కూడా వయసు లేని జగన్ పోటీకి రావడమా అన్నది బాబుకు పట్టుకున్న బాధగా ఆయన కామెంట్స్ బట్టి అర్ధమవుతోంది. అందుకే ఆయన రౌడీల పార్టీ అంటూ ఏ మాత్రం తడుముకోకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ని నేరస్థుడంటూ నిందిస్తున్నారు. అవినీతిపరులు, దుర్మార్గులు అంటూ కూడా ప్రత్యర్ధి పార్టీపై పెద్ద నోరు చేసుకుంటున్నారు. నిత్యం రాజకీయాల్లో హుందాతనం గురించి చెప్పే బాబు ఇలా సహనం కోల్పోయి మాట్లాడడం దారుణమని సెటైర్లు పడుతున్నాయి. బాబు ప్రజాస్వామ్యంలో ఉన్నారు. పోటీని అంగీకరించి తీరాలి.


కొన్ని సందర్భాల్లో ఓటమిని కూడా స్వీకరించాలి. తాను తప్ప ఎవరూ ఏపీ రాజకీయ తెరపై ఉండరాదు అన్నది నియంత పోకడ తప్ప మరోటి కాదు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతున్నామనే అనుకుంటున్నారు తప్ప తన కామెంట్స్ వల్ల తాను ఎంత తగ్గిపోతున్నానో చంద్రబాబు అర్ధం చేసుకోవడం లేదని కూడా సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. బాబు ఇకనైనా ప్రజాస్వామ్యంలో శత్రువులు ఉండరని ప్రత్యర్ధులు ఉంటారని గుర్తించి  మంచి భాషను వాడితే మంచిదని సూచిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: