జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం చిత్రంగా ఉంటుంది. ఆయన సంప్రదాయ రాజకీయలకు భిన్నగా ఉంటారు. ఆయనలో మేధావి కనిపిస్తారు. సామాజిక ఉద్యకారుడు కనిపిస్తారు. అదే సమయంలో ఒక్కోసారి విప్లవవాదిలా కూడా పవన్ కామెంట్స్ ఉంటాయి. మొత్తానికి పవన్ రాజకీయాలు మాత్రం వేరే దార్లోనే వెళ్తున్నాయి.


హంగ్ రావాలట :


పవన్ మార్పు రాజకీయం చూడబోతే కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంది. కర్నూల్లో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన పవన్ ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టరాదంటూ పిలుపు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. సంకీర్ణ రాజకీయాలే మేలు, వాటి వల్లనే అభివ్రుద్ధి అంటూ పవన్ చేసిన  కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ చెప్పినట్లుగా రాజకీయాలో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాకుండా ఉంటే మార్పు ఎలా అవుతుందని అపుడే ప్రశ్నలు మొదలయ్యాయి. దేశంలో ఇప్పటికి పలు మార్లు సంకీర్ణ రాజకీయాలు చూసిన జనం విసిగిపోయిన సంగతి పవన్ కి తెలియదా అంటున్న వారూ ఉన్నారు. స్థిరమైన ప్రభుత్వం లేకపోతే అభివ్రుధ్ధి ఎలా జరుగుతుందో పవనే  చెప్పాలంటున్నారు.


ఏపీలో అదే కోరికా ;


ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ పాత్ర ఏంటన్నది కూడా చర్చగా ఉంది. హంగ్ అసెంబ్లీని పవన్ కోరుకుంటున్నారా అన్నది నిన్నటి వరకూ రాజకీప పండితుల వూహాగానంగా ఉంటే ఇపుడు పవన్ చెబుతున్న మాటలను బట్టి ఏపీలోనూ హంగ్ ఆయన కోరుకుంటున్నారని అర్ధమవుతోందని అంటున్నారు. ఆ విధంగా అయితే పవన్ కీ రోల్ ప్లే చేసే చాన్స్ ఉంటుందని కూడా అంటున్నారు. పవన్ ఇదే మాటను కర్నూల్ మీటింగులో చెప్పారని, అందుకే సంకీర్ణ రాజకీయాలంటూ కొత్త పల్లవి అందుకున్నారని అంటున్నారు. మొత్తానికి పవన్ అనుకున్నట్లుగా ఏ పార్టీకి మెజారిటీ రాకుండా జనం కొత్త తీర్పు చెబుతారా..


మరింత సమాచారం తెలుసుకోండి: