అవును చంద్రబాబునాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మార్చిలో భర్తీ కావాల్సిన మూడు శాసనమండలి స్ధానాల్లో ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబ తాజా నిర్ణయంతో పార్టీలోని సీనియర్ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఓటమి భయంతోనే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారని అర్ధమైపోతోంది.  మార్చిలో ఎనిమిది ఎంఎల్సీ స్ధానాలు భర్తీ చేయాల్సుంది. ఇందులో ఐదు ఎంఎల్ఏ కోటాలో భర్తీ కావాల్సుండగా మిగిలిన మూడు స్ధానాల్లో రెండు పట్టభద్రులు, ఒకటి ఉపాధ్యాయ కోటాలో భర్తీ కావాలి.

 

ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఐదు ఖాళీల్లో నాలుగు టిడిపికి మిగిలిన ఒక్క స్ధానం వైసిపికి వస్తుంది. కాబట్టి ఈ కోటాలో ఎక్కడా సమస్య లేదు. అయితే, మిగిలిన మూడు స్ధానాలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే భర్తీ అవ్వాల్సుంది. అందులో రెండు పట్టభద్రులు, ఒకటి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలో లక్షలాది మంది ఓటర్లు పాల్టొంటారు. ఉపాధ్యాయ కోటానేమో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భర్తీ కావాల్సుంది. మిగిలిన రెండు పట్టభద్రుల కోటా స్ధానాలేమో ఉభయగోదారి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపికవ్వాలి.


పై మూడు స్ధానాల్లో ఎంపికేదైనా నేరుగా ఓటర్లే ఓట్లేస్తారు. ఇక్కడే చంద్రబాబు వెనక్కుతగ్గారు. ప్రత్యక్ష ఓటింగ్ లో గనుక టిడిపి ఓడిపోతే దాని ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నిక మీద పడుతుందని చంద్రబాబు ఆలోచించారు. అదే సమయంలో మూడు స్ధానాల్లో జరగబోయే ఎన్నికకు వైసిపి రెడీ అవుతోంది. పరోక్ష ఎన్నికంటే ఏదోలా మాయచేసి ఓట్లు వేయించుకునే అవకాశం ఉంది. అదే ప్రత్యక్ష ఎన్నికలంటే లక్షలాది మంది ఓటర్లుంటారు. ప్రతీ ఒక్కరినీ మ్యానేజ్ చేయటం సాధ్యం కాదు. కాబట్టే ఓటమిభయం వెంటాడుతోంది. అందుకనే పోటీ నుండి తప్పుకున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో జనాల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతాయనటంలో సందేహం లేదు.  నాలుగున్నరేళ్ళపాటు అధికారంలో ఉంది జనరంజక పాలన అందిస్తున్నామని తన భుజాన్ని తానే చరుచుకుంటున్న చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించటమంటే అర్ధమేంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: