ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి పొరుగు రాష్ట్రంలో తన పార్టీ ప్రాబల్యం పెంచుకోవటానికి తన శాసనసభ్యులతో వెరే పార్టీ ఎమెల్సీలను కొనబోవటానికి ప్రయత్నిచిన ఓటు కు నోటు కేసు జగద్విదితం. ఇప్పుడు ఆ కేసులో ఐదుకోట్ల రూపాయల మనీలాండరింగ్ నేరం ఇమిడి ఉండటంతో కేంద్ర ఆర్ధికనేరాల విచారణ సంస్థ ఎన్-ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ తన విచారణను వేగవంతం చేసింది. 
 ED Targeted AP CM Chandrababu in Vote for note కోసం చిత్ర ఫలితం
తెలంగాణాలో సంచలనం సృష్టించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమ్రేయమున్నట్లుగా భావిస్తున్న ఓటుకు నోటు కేసులో ఆయన మెడకు మరో ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. ఓటు కు నోటు కేసులో ఆయన ఇప్పుడు ఇరకాటంలో పడనున్నట్లు సమాచారం. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, టీడీపీకి అభ్యర్ధికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ కు ₹50 లక్షలు రేవంత్ ఇవ్వటానికి సిద్ధమైనారు.  
ED Targeted AP CM Chandrababu in Vote for note కోసం చిత్ర ఫలితం
ఈ కేసులో  ప్రస్తుత తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబుకి నాయుడికి ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేవంత్ విచారణతో లభ్యమైన సమాచారం మేరకు ఈడీ చంద్రబాబు కు నోటీసులు ఇవ్వటానికి సిద్ధమైనట్లు సమాచారం. ఓటు కు నోటు ఎపిసోడ్ లో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ఉండడంతో ఆ దిశగా రేవంత్ రేవంత్ రెడ్డిపై ఈడి అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది.
vote foor note కోసం చిత్ర ఫలితం
రేవంత్ రెడ్డిని విచారిస్తున్న సందర్భంగా ఏసీబీ దాఖలు చేసిన కేసులో చంద్రబాబు పేరును 20 సార్లు రికార్డు చేసినట్లు సమాచారం. రేవంత్ ను ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఈడీ అధికారులు వివిధ కోణాల్లో ఆయన నుంచి సమాచారం రాబట్టడానికి ప్రశ్నించారు.  చంద్రబాబు దేని గురించి స్టీఫెన్ సన్ దగ్గరకు మిమ్మల్ని పంపించారని ఈడీ రేవంత్ ను అడిగింది. స్టీఫెన్ సన్ కు తొలుత ₹50 లక్షలు ఇవ్వడం, మిగతా ₹450 లక్షలు ఎవరి నుంచి నగదు తీసుకొని తరలించబోతున్న విషయా లపై రేవంత్ నుంచి సమాధానం కోసం ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయంపై ఈడీ అధికారులు తరచి తరచి ప్రశ్నించినట్టు తెలిసింది.


ఇదిలా ఉండగా ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులు సైతం ఈడీ అధికారుల ముందు హజరయ్యారు. రేవంత్ రెడ్డిని విచారించిన తీరు-ఈడీ దర్యాప్తు పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలో ఈడీ నోటీసులు పంపడం ఖాయమని అంటున్నారు. బహుశ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు ఇస్తానని వాగ్ధానం చేసిన రిటర్న్ గిఫ్ట్ పాకేజీలో ఇది కూడా ఒక భాగం కావచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: