మంత్రి నారా లోకేష్‌. సీఎం చంద్ర‌బాబు ఏకైక కుమారుడు. కీల‌క రాజ‌కీయ నేత‌. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. విజ‌న్ ఉన్న నాయ‌కుడుగా కీర్తి కూడా సంపాయించుకుంటున్నారు. తాను చేప‌ట్టిన శాఖ‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే, ఆయ‌న 2017 వ‌రకు కూడా పార్టీలో స‌ల‌హాదారుగానే ఉన్నారు. అయితే, ఆ త‌ర్వాత లోకేష్ కృషిని గుర్తించిన చంద్ర‌బాబు ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. అయితే, ఎమ్మెల్సీగా ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేసి.. మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీగా ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉండ‌గానే .. ఆయ‌న రాజీనామా చేయించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 


అలా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించ‌క పోయినా.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యిం చుకున్నారు. దీనికి సంబంధించి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం కోసం వెతుకులాట ప్రారంభించారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అనే విషయంలో అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీకి రాలేకపోతున్నారు చంద్రబాబు. వాస్త‌వానికి బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ అక్కడి నుంచి మళ్లీ చంద్రబాబే పోటీలోకి దిగబోతున్నారు. దీంతో.. లోకేష్ కు కుప్పం సీట్ మిస్ అయ్యింది. ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో విజ‌య‌వాడ‌కు స‌మీపంలోనే ఉండే నియోజ‌వ‌క‌ర్గం మంగళగిరి నుంచి పోటీ చేయించాలని భావించారు. 


రాజధాని రావడంతో.. అక్కడి రైతులు - ప్రజలు ఆనందంగా ఉన్నారు. అవన్నీ ఓట్లుగా మారతాయని తెలిసినా.. నెగిటివ్ ఓటింగ్ జరిగితే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఇక గుంటూరు జిల్లా పెదకూరపాడులో కమ్మ ఓటింగ్ చాలా ఎక్కువ. దీంతో.. అక్కడినుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉంది. ఈ రెండూ కాకుండా కృష్ణా జిల్లాలోని పెనుమలూరు నియోజకవర్గం కూడా పరిశీలనలో ఉంది.

ఏదిఏమైనా కృష్ణా - గుంటూరు జిల్లాల నుంచే లోకేష్ ని బరిలోకి దించాలని భావిస్తున్నారు. మరి ఇప్పుడు లోకేష్ కోసం త్యాగం చేయ‌నున్న ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరో చూడాలి. అయితే, ఇక్కడే మ‌రో ట్విస్ట్ ఉంది. పెన‌మ‌లూరును బోడే ప్ర‌సాద్‌కు సిట్టింగ్‌కే క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఇక‌, మంగ‌ళ‌గిరిలో క‌మ‌ల‌ను పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె కు ఈ సీటు రిజ‌ర్వ్ చేశారు. పెద‌కూర‌పాడులో కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ సీటు పైనే ఆశ‌లు ఉన్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: