వైసిపి రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్లతో చంద్రబాబునాయుడు, పుత్రరత్నం లోకేష్ ను ఓ ఆటాడుకుంటున్నారు. కొద్ది రోజులుగా తండ్రి కొడుకుల గాలి తీసేస్తున్న ఎంపి తాజాగా మరోసారి లోకేష్ పై విరుచుకుపడ్డారు. ఎస్సీలపై టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వ్యాఖ్యపై ఎస్సీలు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అదే సమయంలో చింతమనేని వ్యాఖ్యలను పోస్టు చేసిన వైసిపి కార్యకర్త రవిని మాత్రం పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

 

ఆ విషయంపై స్పందించిన విజయసాయి ట్విట్టర్ వేదికగా లోకేష్ కు ప్రశ్నలు సంధించారు.   ట్వీట్లు, ఫేస్ బుక్ లో పోస్టింగులను సాకుగా చూపిస్తూ ఎవరినీ అరెస్టులు చేయొద్దంటూ 2015లోనే సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎంపి లోకేష్ కు గుర్తుచేశారు. ‘సుప్రింకోర్టు తీర్పు కూడా తెలియని మీరేం ఐటిమంత్రం’టూ లోకేష్ గాలి తీసేశారు.

 

‘రవిని అరెస్టు చేయటానికి మీరు వర్తింపచేసిన రూల్సునే మీకు కూడా వర్తింపచేస్తే మీరు చేసే ట్వీట్లకు మిమ్మల్ని రోజుకు ఎన్నిసార్లు అరెస్టులు చేయాలి’...అంటూ నిలదీశారు. అంతేకాకుండా మీ డాడి షాడోలో నుండ బయటకు రా అంటూ హితవు పలికారు. చింతమనేని దళితులను దూషించిన వ్యాఖ్యలను తాను కూడా పోస్టు చేస్తున్నానని కాబట్టి ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి అంటూ సవాలు విసిరారు. రవిని అరెస్టు చేసిన ప్రభుత్వం ఇపుడు విజయసాయిరెడ్డిని ఏం చేస్తుందో చూడాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి: