మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌ల‌కు వెళ్తున్న ఏపీలో తీవ్ర‌మైన రాజ‌కీయ ఉత్కంఠ కొన‌సాగుతోంది. రాజ‌కీయంగా బ‌లంగా ఉన్న రెండు ప్ర‌ధాన పార్టీలు, ఇక‌, ఈ ఎన్నిక‌ల‌ను తీవ్ర‌స్థాయలో ప్ర‌భావితం చేస్తామ‌ని చెబుతున్న మ‌రో పార్టీ కూడా ఇప్పు డు ఎలా ఉన్నాయి? ఎలాంటి ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి? ఎలా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాయి? అనే ప్ర‌శ్న లు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు చాలా చిత్ర‌మైన మార్కులు, చ‌ర్చ‌లు వీటికి ల‌భిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విభ జ‌న త‌ర్వాత సీనియ‌ర్ మోస్ట్ అనే ఏకైక కార‌ణంగా చంద్ర‌బాబుకు అధికారం అప్ప‌గించారు ఏపీ ప్ర‌జ‌లు. 


ఇక‌, వైసీపీని ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టారు. ఇక‌, ముచ్చ‌టగా మూడో పార్టీ జ‌న‌సేన‌.. విష‌యం ఈ ఎన్నిక‌ల్లో తేల‌నుంది. ఇలా ప్ర‌జ‌లు విజ్ఞులై త‌మ త‌మ పార్టీల‌ను ఎంచుకున్నారు. ఇక‌, మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మం లో ఏ పార్టీ అయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం మాదేన‌ని స్ప‌ష్టం చేసే పార్టీ ఒక్క‌టి కూడా క‌నిపించ‌డం లేదు. ఐదేళ్ల పాటు సుదీర్ఘ‌కాలం ప్ర‌జ‌ల‌ను పాలించి అభివృద్ధి అజెండాతో ముందుకు సాగిన టీడీపీ కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామే విజ‌యం సాధిస్తామ‌ని చెప్పుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా ఎన్నిక‌ల ముందు మ‌రింత భ‌యం ప‌ట్టుకుంది. 


ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ప‌రిస్థితిని చూసినా.. ఇదే క‌నిపిస్తోంది. ఆ పార్టీ కూడా ఎన్నిక‌ల్లో గ‌ట్టిగా గెలుస్తామ‌ని చెప్ప‌లే ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లోపిస్తోంది. దీనికితోడు అధికార పార్టీ నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌చారానికి, వ్యాఖ్య‌ల‌కు త‌గిన విధంగా స‌మాదానం చెప్ప‌లేని ప‌రిస్థితికూడా వైసీపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌త్యంలో ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? అనే విష‌యాన్ని ఆయా పార్టీలు కూడా చెప్పుకోలేని ప‌రిస్థితిలోనే ఉండడం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం ఏపీలో ఉత్కంఠ‌ను రేపింది. ఇక‌, ముచ్చ‌ట‌గా మూడో పార్టీ జన‌సేన ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌.. హాయిగా నిద్ర‌పోతుండ‌డం కూడా మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతోంది. ఇదేనా మార్పు అని ప్ర‌శ్నించేవారు కూడా క‌నిపిస్తున్నారు. సో.. ఇదీ విష‌యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: