ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీడీపీ పార్టీలో చాలా భయం కనిపిస్తుంది. అయితే ఏకంగా చంద్ర బాబే మంత్రులకు ప్రతి పక్షం మీద రెచ్చిపోవాలంటూ క్లాస్ పీకడం గమన్హారం. మంత్రులేమో, ఎన్నికల్లో పోటీ చేయడం గురించీ, గెలుపోటముల గురించీ ఆలోచనలు చేస్తూ.. పాపం, చంద్రబాబుని పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్‌ భేటీ ముగిశాక, మంత్రులతో సుమారు గంటన్నరకు పైగానే చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయి, వారికి ప్రతిపక్షం విషయంలో ఎలా వ్యవహరించాలో నేర్పించారట. ఈ విషయాన్ని స్వయంగా తెలుగు తమ్ముళ్ళే ఆఫ్‌ ది రికార్డ్‌గా మాట్లాడుతూ మీడియాకి ఉప్పందించేశారు. 


ఎన్నికల ముందు బాబుకు పెద్ద షాక్ ... ఓటుకు నోటు కేసులో నోటీసులు..?

ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారడం ఎన్నికల ముందర మామూలే. ముందు ముందు మంత్రులు కూడా పార్టీ మారబోతున్నారంటూ ఓ ఆసక్తికరమైన ప్రచారం తెరపైకొచ్చింది. ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు, ఎన్నికల నాటికి టీడీపీకి గుడ్‌ బై చెప్పడం ఖాయమనే ప్రచారం జోరందుకోవడంతో, చంద్రబాబు ఉలిక్కిపడ్డారట. 'మీలో ఎవరికైనా ఆ ఆలోచనలున్నాయా.?' అని చంద్రబాబు, తాజా భేటీలో మంత్రుల్ని నిలదీశారట కూడా.  అయినా, మంత్రి పదవి కాదనుకుని.. ఇతర పార్టీల్లోకి వెళ్ళేందుకు సాహసించే మంత్రులు టీడీపీలో వున్నారా.?


ఎన్నికల ముందు బాబుకు పెద్ద షాక్ ... ఓటుకు నోటు కేసులో నోటీసులు..?

అంత కమిట్‌మెంట్‌ ఏ మంత్రికైనా వుందా.? అనే చర్చ కూడా లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.  అంతా బాగానే వుందిగానీ, ప్రతిపక్షాన్ని తిట్టాల్సిందిగా మంత్రుల్ని ముఖ్యమంత్రి పురమాయించడమేంటట.? అదే మరి, చంద్రబాబు రాజకీయం అంటే. ఆల్రెడీ చాలామంది మంత్రులు అదే పనిలో బిజీగా వున్నారు. అచ్చెన్నాయుడు కావొచ్చు, దేవినేని ఉమ కావొచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కావొచ్చు, మరో మంత్రి కావొచ్చు.. నిత్యం మీడియాలో కన్పిస్తూనే వున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఓ విమర్శ వస్తే, పది తిట్లతో విరుచుకుపడిపోతున్నారు మంత్రులు. చంద్రబాబు పట్ల మంత్రులు ఇంత విధేయత చూపుతున్నా, పాపం చంద్రబాబుకే మంత్రుల పట్ల నమ్మకం కుదరడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: