సినీ నటుడు కమ్  రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్  తన పార్టీ కార్యక్రమాలను ఈ మధ్య కొంత  తగ్గించినా మళ్ళీ పర్యటనలు చేస్తున్నారు. తనకు అధికారం కావాలని  ఒకసారి, అక్కరలేదని మరో సారి చెబుతూ అదే అయోమయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న పవన్ తన అన్న చిరంజీవికి కొంత మంది దెబ్బ కొట్టి వెళ్ళిపోయారని ఆవేదన కూడా చెందుతున్నారు.


రైతు ఝలక్  :


ఇదిలా ఉండగా కర్నూల్ పర్యటన్లో ప్రస్తుతం ఉన్న పవన్ అక్కడ నిన్న  అదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులతో ముఖాముఖీ నిర్వహించారు  ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ వ్రుధ్ధ రైతు రైతుల సమస్యలపై మాట్లాడుతూ, మీరూ (పవన్) నేనూ అందరూ కలసి జన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటే రైతుల సమస్యలు తీరురాయని అనడంతో పవన్ ఒక్కసారిగా షాక్ తినాల్సి వచ్చింది. పవన్ భుజంపై చేయి వేసి మరీ ఆ రైతు చెప్పడం గమనార్హం.  ఆ వెంటనే పవన్  ముఖంలో మార్పు కూడా కంపించిందిట. ఇక జగన్ సీఎం అంటూ ఆ రైతు చెబుతూంటే సభలో జై జగన్ అంటూ నినాదాలు కూడా వినిపించడంతో పవన్ తో పాటు జనసైనికులు అసహహనానికి గురి అయ్యారని భోగట్టా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పవన్ని అలా చూడడంలేదా  :


నిజానికి ఓ రాజకీయ పార్టీ సభలో మరో నేతపై జై నినాదాలు చేయడం ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. పవన్ విషయానికి వస్తే ఆయన ఇంకా పూర్తి రాజకీయ నాయకుడు కాదు. దాంతోనే ఆ రైతు అలా అనడంతో షాక్ తినాల్సివచ్చింది. ఇక రైతులు తమ గోడు పవన్ తో చెప్పుకోవడం వరకూ బాగానే ఉన్నా తమ బాధలు తీర్చే ప్రభుత్వ సారధిగా పవన్ని వారు చూడడంలేదా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. ఏపీలో ఇంకా టీడీపీ, వైసీపీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. దానికి పవన్ సభలు సైతం మినహాయింపు కాదనడానికే ఈ రైతుల‌ జగన్నినాదం అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: