ప్రధాన మంత్రి మోడీ చంద్రబాబుపై కక్ష కట్టారు. ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐతో దాడులు చేయిస్తున్నారు. ఈడీ, ఇతర సంస్థలను రాజకీయం కోసం మోడీ వాడుతున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించేందుకు మోడీ విశ్వప్రయత్నం చేస్తున్నాడు.. ఇదీ ఇటీవల టీడీపీ చేస్తున్న ప్రచారం.

సంబంధిత చిత్రం


కానీ ఓ కేంద్రమంత్రి తాజాగా చెప్పిన వ్యాఖ్యలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అసలు మోడీ ఉండబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉన్నారట. మోడీ లేకపోతే.. చంద్రబాబు ఈపాటికి జైల్లో కూర్చుని ఉండేవారట. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్.

modi and chandrababu కోసం చిత్ర ఫలితం


కిందటి ఎన్నికలలో బీజేపీ వల్ల, మోడీ నాయకత్వం వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారని జవదేకర్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభంజనం లేకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఉండేది కాదని ఆయన అన్నారు. గుంటూరులో మేధావుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

prakash javdekar కోసం చిత్ర ఫలితం


గత సారి చంద్రబాబు గెలవకపోతే జైలులోనే ఉండేవారని ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా చేశారు. 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయిని, అంతకు ముందు మామ ఎన్టీఆర్‌ను, ప్రస్తుతం మోదీని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కేంద్ర మంత్రి ఘాటు కామెంట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: