తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలుగుదేశం ఎ0పీ, పారిశ్రామికవేత్త రాయపాటి సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రా పారిశ్రామిక వేత్తలను, రాజకీయ నాయకులను బెదిరిస్తున్నారట. ప్రత్యేకించి పారిశ్రామిక వేత్తలను బెదిరించి జగన్ పార్టీకి వందకోట్లు ఫండ్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట.



ప్రత్యేకించి ఫార్మా కంపెనీలను కేసీఆర్ టార్గెట్ చేశారట. మా ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి మేం చెప్పినట్టు వినాల్సిందే అని కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నారట. కేసీఆర్ బెదిరింపులకు తలొగ్గిన ఈ పారిశ్రామికవేత్తలు ఈ వారం రోజుల్లోనే జగన్ పార్టీకి ఫండ్ ఇచ్చేందుకు అంగీకరించారట. మరి ఇందులో ఎంత వరకూ వాస్తవం ఉందో ఆ దేవుడికే తెలియాలి.

rayapati sambasiva rao కోసం చిత్ర ఫలితం


అంతే కాదు.. తమ ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయ్యాన్ని మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేసినందుకు రూ.150కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇంకా ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే గచ్చిబౌలి, శంషాబాద్‌ రహదారి నిర్మాణం చేసినందుకు మరో రూ.150కోట్లు రావాల్సి ఉందన్నారు. మొత్తం రూ.300 కోట్లు మేర తెలంగాణ ప్రభుత్వం తమకు బకాయి పడి ఉందని కానీ కేసీఆర్ సూచనల మేరకే అధికారులు నిధులు విడుదల చేయడం లేదట.

rayapati sambasiva rao AND KCR కోసం చిత్ర ఫలితం


కానీ ఇన్నాళ్లూ ఎలాంటి ఆరోపణలు చేయని రాయపాటి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు కూడా ఇదే తరహా కామెంట్లు చేస్తున్నారు. ఆయన వాదనకు మద్దతుగా ఆయన సూచనలతోనే రాయపాటి ఇలా మాట్లాడి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: