ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మోడీ సంగతేమో కానీ చంద్రబాబు మాత్రం నిత్యం మోడీ జపం చేస్తూ తపిస్తున్నారు. మోడీని తిట్టకుండా చంద్రబాబుకు పూట కూడా గడవడం లేదు. ఏపీలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీపైనే ఆయన కోపమంతా కనిపిస్తోంది.

modi safayi కోసం చిత్ర ఫలితం


అయితే ఇప్పుడు చంద్రబాబు మరో విచిత్రమైన వాదన చేస్తున్నారు. మోడీ మొన్న సఫాయి కార్మికుల కాళ్లు కడిగారు. దీనిపై చంద్రబాబు సెటైర్లు వేస్తున్నారు. సఫాయి కార్మికులు 4ఏళ్లుగా పారిశుద్ద్య సేవలు అందిస్తున్నా మోడీ ఎన్నికల ముందే వారి కాళ్లు కడుగుతున్నారు.

chandrababu auto driver కోసం చిత్ర ఫలితం


ఇది మోడీ ఫ్రస్ట్రేషన్ ను తెలియజేస్తోందంటూ చంద్రబాబు కొత్త వాదన వినిపించారు. మోడీకి పార్టీలోనూ అంతర్గతంగా అసమ్మతి రేగుతోందని చంద్రబాబు అంటున్నారు. బాగానే ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానేమో అని మోడీ ఫస్ట్రేషన్ కు గురవుతున్నారేమో అనుకుందాం..

సంబంధిత చిత్రం


మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి.. ఆయన కూడా విపరీతంగా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు కదాఎన్నికల ముందు అన్ని వర్గాలకూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. వృద్ధులు, రైతులు, డ్వాక్రా మహిళలు.. ఇలా అన్ని వర్గాలపైనా ప్రేమ కురిపిస్తున్నారు. మరి ఇది కూడా చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ను సూచిస్తోందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: