గత కొంత కాలంగా పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పపడుతుంది.  ఓ వైపు స్నేహ సంబంధాన్ని కొనసాగిద్దాం అంటూనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో భారత సైనికులపై దాడులు కొనసాగిస్తుంది.  గత సంవత్సరం పంజాబ్ లోని యూరి సెక్టర్ పై ఎటాక్ చేయించింది.  ఇక మొన్న పుల్వామ లో భారత సైనికులపై దారుణమైన అటాక్ చేశారు ఉగ్రవాదులు.  ఈ దాడిలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాంతో భారత సైనికులు ప్రతీకార చర్యకోసం ఊగిపోయారు. కేవలం సైనికులు మాత్రమే కాదు యావత్ భారత దేశం మొత్తం పాక్ పై దుమ్మెత్తి పోసింది. 
Image result for indian air force attack
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది అదే..సర్జికల్ స్టైక్ 2.  దేశ నియంత్రణ రేఖ (ఎల్ ఓ సీ) వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మంగళవారం వేకువ జామున మెరుపు దాడులు చేయడం తెలిసిందే. మిరేజ్ 2000 యుద్ధ విమానాలు 1000 కేజీల బాంబులను మోసుకెళ్లి ఉగ్రవాదులు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి.
Image result for indian air force attack
మెరుపు దాడులు 100 శాతం విజయవంతం అయ్యిందని, తాము ప్లాన్ చేసుకున్నట్లు జరిగిందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు.  ఇక శత్రువులు కనిపించకపోయినా, ముప్పు పొంచి వుంటుందని తెలిసినా అన్ని విధాలుగా త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉంటాయి.  ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిద దళాలకు సెలవు రద్దు చేసింది.  యుద్దమేఘాలు కమ్ముతున్న సమయంలో సెలవులపై ఉన్న సైనికులు సైతం విధులకు హాజరు కావాల్సిందిగా కోరినట్లు సమాచారం. మొత్తానికి పుల్వాలపై జరిగిన దాడికి భారత ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకోవడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: