ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడితే ఎంత ఆనందమో కదా..? ఇప్పుడు మోదీ ఫీలింగ్ కూడా దాదాపు ఇదే.! ఎందుకంటే ఈ ఒక్క రోజే 3 కీలక సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ మోదీ భవిష్యత్ ను నిర్ణయించబోయేవే..! అదీ ఈరోజే..!

Image result for india counter attack

ఉదయం నిద్రలేవకముందే భారతీయులందరూ శుభవార్త విన్నారు. పాక్ పై సైన్యం మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందనే గుడ్ న్యూస్ భారతీయులందరినీ నిద్ర లేపింది. అర్ధరాత్రి నుంచే మొదలైన దాడుల పరంపర తెల్లవారుజాము వరకూ కొనసాగింది. ముఖ్యంగా టెర్రరిస్టు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో వందలాది మంది ముష్కరులు చనిపోయి ఉంటారని అంచనా. మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా చేసిన ఈ దాడుల్లో టెర్రరిస్టు అగ్ర నేతలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది భారత్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సందర్భం. సరిహద్దుకు ఆవల ఉంటూ భారత గడ్డపై నిత్యం అలజడులకు కారణమవుతున్న పాక్ ఉగ్రవాద మూకలపై మూకుమ్మడి దాడి చేయడం భారత్ తక్షణావసరం. పుల్వామా దాడి తర్వాత భారత్ ఇలాంటి సందర్భం కోసమే ఎదురు చూస్తోంది. అది ఈరోజు నెరవేరినట్లయింది.

Image result for ayodhya case

ఇక మోదీ ఎదురు చూస్తున్న మరో కీలక అంశం కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. జమ్మ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 35A పైన సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్ము కశ్మీర్ పౌరులకు కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు లభిస్తున్నాయి. అంతేకాక స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనడం, ఉండడం కుదరదు. కశ్మీరీ మహిళ వేరే రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుంటే ఆస్తి హక్కు కోల్పోతారు. అయితే భారత్ లో అంతర్భాగమైన జమ్ము కశ్మీర్ కు మాత్రం ఇలాంటి ప్రత్యేక అధికారాలు ఎందుకు ఉండాలంటూ సుప్రీంకోర్టులో ఎంతోకాలం క్రితం పిటిషన్ దాఖలైంది. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. తాజాగా మూడ్రోజులపాటు ఈ అంశంపై 3 రోజులపాటు విచారణ జరపాలని సుప్రీం నిర్ణయించింది. తీర్పు ఏదైనా ఇదొక సంచలనం సృష్టించడం ఖాయం.

Image result for article 35a

దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య అంశంపై కూడా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం విచారణకు సిద్ధమవుతోంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య అంశంపై విచారణ చేపట్టబోతోంది. అయోధ్య సమస్యపై చాలాకాలంపాటు విచారించిన అలహాబాద్ హైకోర్టు 3 మార్గాలను సూచిస్తూ తీర్పు చెప్పింది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఇది కూడా విచారణ జరగుతోంది.

Image result for modi

ఈ మూడు అంశాలూ మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనవి. ఈ మూడూ ఇదే రోజు జరుగుతుండడంతో యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: