ప్రస్తుతం భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆనందోత్సాహాలతో గంతులేస్తున్నారు.  పుల్వామా పై ఉగ్రవాదులు దాడి చేయగా భారత సైనికులు నలభై మంది అమరులయ్యారు.  దానికి ప్రతీకారంతో రగిలిపోతున్న భారత ప్రభుత్వం నేడు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొచ్చుకెళ్లి, ముజఫరాబాద్, బాలాకోట్ తదితర ప్రాంతాల్లో లక్షిత దాడులు నిర్వహించింది.  ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 

 కార్గిల్ యుద్ధ విమానం తర్వాత ఈ దాడులు చేయడం ఇదే తొలిసారి. భారత్ విమానాలు ఎల్ఓసీ దాటినట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. ఈదాడుల్లో అతిపెద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసమయింది. అయితే దీనిపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు భారత వైమానిక దళాలను ప్రశంసిస్తున్నారు.  ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన "ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అని వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు నిర్వహించిన రెండో సర్జికల్ స్ట్రయిక్స్ పై దేశవ్యాప్తంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

అయితే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష హోదాలో ఉన్న ముఖ్య నేత ఇలా వెంటనే ట్విట్ చేయడం పై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది.. దానికి కారణం తాము ఎలాంటి పరిస్థితుల్లో దాడి చేశామని ఎన్డీయే ప్రభుత్వం వివరణ ప్రతిపక్షానికి ఇచ్చిన తర్వాత ఇలాంటి ప్రశంసలు ఇస్తే బాగుండేదని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: