దాయాది దేశం పాకిస్థాన్ కి దిమ్మ తిరిగే షాక్ భారత్ ఇచ్చింది. తెల్లవారు జామున భయంకరమైన కల లాంటి నిజాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించేసింది. భారత్ దెబ్బ అంటే అబ్బా అనాల్సిందేనని కూడా క్లారిటీగా చెప్పేసింది. భారత్ కనుక తలచుకుంటే ఆ రీసౌండ్ ఏ రేంజిలో ఉంటుందో కూడా పక్కాగా చూపించేసింది.


యుద్ధమేనా :


మోడీ నాయ‌కత్వంలో భారత్ సైన్యానికి తెగింపే తప్ప మరేం తెలియవన్నది మరో మారు రుజువైంది. బోర్డర్ దాటి బొంగరం ఆడించేస్తామని చెప్పి మరీ చేసేంది మన ఆర్మీ. నిజానికి బోర్డర్ దాటడం అంటే యుద్ధానికి సన్నద్ధం కావడమే. భారత వాయు సేన పాక్ గగన తలంలోకి చొచ్చుకుని వెళ్ళిపోవడం బట్టి చూస్తూంటే ఈ కధ ఇంతటితో ఆగదని తెలుస్తోంది. పాక్ కి ఇంకా కరెంట్ షాకులు చాలానే ఉన్నాయని కూడా భారత్ చెప్పినట్లైంది.


ఇందిర తరువాత :


అప్పట్లో అంటే 1971 నాటి పాక్ యుధ్ధంలో ఇండియా దాదాపుగా లాహోర్ దాకా వెళ్ళి  పాక్ ముష్కరులను తరిమి కొట్టింది. అప్పట్లో జరిగిన యుద్ధంలో భారత్ విజయఢంకా మోగించడమే కాదు. పాక్ పీచమణిచేసింది. రెండుగా విడగొట్టి బంగ్లాదేశ్ కి ముక్తి ప్రసాదించింది. ఇపుడు కూడా పదునైన వ్యూహంతోనే భారత్ ఉందని అర్ధమవుతోంది. పాక్ ని మరిన్ని ముక్కలుగా కొట్టడమే కాకుండా 1947 నాటికి మన భూభాగంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ ని కూడా తిరిగి తెచ్చుకునేందుకు భారత్ సిధ్ధంగా ఉందని అంటున్నారు. 


ఓ విధంగా పుల్వామా  దాడితో కెలికి పాక్ తన కొరివి తానే పెట్టుంది. ఇపుడు చిరిగి చాట అయింది. ప్రపంచం మొత్తం మీద విశ్వాసం కోల్పోయిన పాక్ ని ఆదుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని స్థితి. మొత్తం మీద మోడీ అన్న మాట ప్రకారం పాక్ కి దెబ్బ కొట్టి భారతీయుల మీసం మెలి తిప్పేలా చేయగలిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: