చంద్రబాబునాయుడు ఎపుడు ఏ నినాదం ఎత్తుకుంటారో ఆయన పార్టీ వారికే తెలియదు. నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా వద్దన్న  పెద్ద మనిషి ఆయన. హోదా సంజీవినా అంటూ వెటకారం చేసిందీ ఆయనే. హోదా వల్ల ఏమొస్తుందో తనని ఎడ్యుకేట్ చేయమని కోరిందీ ఆయనే. హోదా వల్ల ఏం రావంటూ బుకాయించిందీ ఆయనే. అదే చంద్రబాబు తరువాత రోజుల్లో అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హోదాపై అర్జంట్ గా ప్లేట్ ఫిరాయించేసిన సంగతీ అందరికీ తెలిసిందే.


ఇపుడు జోన్ అంటున్నారు :


లేటెస్ట్ గా వస్తున్న భోగట్టా ఏంటంటే విశాఖకు రైల్వే జోన్ కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి బాబు గారు లేఖ రాశారట. ఇది నిజంగా వింతలో కెల్లా వింత. అయిదేళ్ళ అయుర్దాయం బాబు గారి  సర్కార్ కి తీరిపోతోంది. ఇక నేడో రేపో నోటిఫికేషన్ వచ్చేస్తోంది. ఎన్నికలను ముందర పెట్టుకుని ఇపుడు జోన్ అంటూ బాబు కలవరిస్తున్నారు.  నిజానికి ఇప్పటికి విశాఖ ఎన్నో మార్లు వచ్చినా రైల్వే జోన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని బాబు గారికి ఇపుడే  రైల్వే జోన్ గుర్తుకు రావడానికి కూడా కారణం ఉంది.


ప్రధాని ప్రకటిస్తారనే :


మార్చి ఒకటిన ప్రధాని విశాఖ టూర్ ఉంది. ఓ వైపు మోడీ గో బ్యాక్ అంటూ ఇదే టీడీపీ నేతలు ఆయన టూర్ ని అడ్డుకుంటున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. మరో వైపు విశాఖ రైల్వే జోన్ కోసం ప్రధాని సభలో ప్రకటిస్తారేమోనని కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇపుడు బీజేపీని, మోడీని బండ బూతులు తిట్టిన టీడీపీ ఏ విధంగానూ రైల్వే జోన్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోలేదు. పైగా జోన్ విషయం తమ్ముళ్ళు ఎపుడో మరచిపోయారు. అయితే ఏపీ బీజేపీ నాయకులు మాత్రం జోన్ కావాలంటూ ఆందోళన చేశారు. ఈ మధ్యన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రీ వచ్చినపుడు జోన్ కోసం కోరడం జరిగింది. 


ఆ తరువాత దాన్ని అమిత్ షా పీయూష్ గోయల్ వరకూ తీసుకెళ్లారు. వారం క్రిత్రం ఏపీ బీజేపీ నేతలు డిల్లీకి వెళ్ళి మరీ పీయూష్ గోయల్ తో మాట్లాడారు. జోన్ తప్పకుండా ఇస్తామనిపించుకున్నారు. ప్రధాని మీటింగ్ విశాఖ ఉంది కాబట్టి అక్కడే ప్రకటన ఉంటుందని కూడా ఆ పార్టీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. ఇవన్నీ తెలుసుకున్న టీడీపీ ఇపుడు రైల్వే జోన్ ప్రధాని ప్రకటిస్తే ఎక్కడ బీజేపీకి లాభమవుతుందోనన్న కలవరంతోనే బాబు గారు ఇలా జోన్ అంటూ లేఖను సంధించారని అంటున్నారు. జోన్ పై చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్ళ పాటు కేంద్రంలో అధికారం పంచుకునపుడు టీడీపీకి ఎందుకు గుర్తుకు రాలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మా బాబు గోరు మా మంచోరు. ఎన్నికలు ఎపుడు వస్తే అపుడే ఆయనకు ఠక్కున అన్నీ గుర్తుకువస్తాయని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: