దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఏపీ రాజకీయాలు బాగా తెలిసిన వారికి ఆయన పేరు పరిచయం చేయనవసరం లేదు. అన్న నందమూరి  తారక  రామారావు పెద్ద అల్లుడుగా పాలిటిక్స్ లోకి  ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి ఆ తరువాత తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిజాయతీగా ఉండడం ఆయన విధానం. టీడీపీలో ఆయన నీతివంతమైన రాజకీయమే చేస్తూ వచ్చారు.


ఆయనతోనే సిరి :


దగ్గుబాటి అంటేనే బంగారం అంటారు. ఆయనతోనే  సిరి ఉంటుంది. ఆయన ఎవరి పక్కన ఉంటే వారికి అందలమే అని చెబుతారు. అన్న గారు ఒకే ఒక్కడుగా తెలుగుదేశం పార్టీని పెట్టినపుడు మొదట చేరింది దగ్గుబాటి వారే. అలా తన సిరితో నందమూరికి ముఖ్యమంత్రిని చేశారు. ఇక కొన్నేళ్ళ తరువాత అదే అన్న గారికి గద్దె దించేటపుడు దగ్గుబాటి వారి లక్కీ హ్యాండ్ తోడల్లుడు చంద్రబాబుకు కావాల్సివచ్చింది. అంతే బాబు కూడా 1995లో ఇదే దగ్గుబాటి వారి చలవతో సీఎం అయిపోయారు. ఇక 1999 ఎన్నికల్లో దగ్గుబాటి బీజేపీలో చేరితే ఆ పార్టీకి ఏకంగా ఉమ్మడి ఏపీలో ఏడు సీట్లు వచ్చాయి. కేంద్రంలో  వాజ్ పేయ్ ప్రధాని కూడా అయ్యారు.


వైఎస్సార్ కి కలసివచ్చింది :


ఇక దగ్గుబాటి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి అందరికీ షాక్ తినిపించారు. ఆయన చేరికతో కాంగ్రెస్ కి కొత్త ఊపు రావడమే కాదు. ఆ ఎన్నికల్లో  ఉమ్మడి ఏపీలో అనూహ్య విజయం సాధించి వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి కూడా కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పారు. ఇదంతా గతం. ఇపుడు దగ్గుబాటి వైసీపీలోకి వస్తున్నారు. చాలాకాలం తరువాత ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. అయినా అదే దూకుడు, అదే జోష్ తో ఉన్నారు.  


జగన్ సీఎం కావడం ఖాయం :


ఇపుడు దగ్గుబాటి వారి లక్కీ హ్యాండ్ జగన్ వైపుకు వచ్చింది. ఈ నెల 27న దగ్గుబాటి వైసీపీలో అధికారికంగా చేరుతున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. జగన్ ఏపీలో తన సొంత ఇంట్లో గ్రుహ ప్రవేశం చేస్తున్న వేళ పార్టీ తీర్ధం తీసుకునే తొలి వ్యక్తి దగ్గుబాటి. ఆ విధంగా దగ్గుబాటి లక్కీ హ్యాండ్ జగన్ కి ఎంతగానే కలసివస్తుందని అంటున్నారు. ఇప్పటికే తనతో పాటు అనేకమందిని వైసీపీలోకి తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేసిన దగ్గుబాటి ఆ పార్టీ విజయానికి పూర్తిగా బాటలు వేస్తున్నారు. ఓ విధంగా దగ్గుబాటి చంద్రబాబు ఓటమికి కసితో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఏ విధంగా చూసినా దగ్గుబాటి చేరిక వైసీపీకి కలసివచ్చేదే. 


మరింత సమాచారం తెలుసుకోండి: