భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్ట్రయిక్స్ చేయడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఇండియా తగిన దెబ్బ తీస్తుందని ఆ దేశం ఊహించినా.. ఈ స్థాయిలో ప్రతి చర్య ఉంటుందని భావించలేదు. ఒకేసారి మూడు ప్రాంతాల్లో భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడిన ఘటనపై పాక్ ప్రభుత్వాధినేతలు, సైన్యం చర్చించింది.

indian air force attacks కోసం చిత్ర ఫలితం


భారత్ మెరుపుదాడుల సంగతి తెలియగానే.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిందిటల తరబడి భవిష్యత్ వ్యూహంపై చర్చించింది. పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే ఈ అథారిటీ అత్యవసరంగా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.



ఈ సమావేశం తర్వాత పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ పాక్ మీడియాతో మాట్లాడారు.. ఇక మీ వంతు... కాచుకోండి అంటూ భారత్ ను హెచ్చరించారు. భారత్ సర్ ప్రైజ్ అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. ఎన్సీఏ ఎందుకు సమావేశం అయిందో త్వరలోనే మీకు తెలుస్తుంది అంటూ ఉద్వేగంగా చెప్పారు.

సంబంధిత చిత్రం

సర్వశక్తిమంతుడు అల్లా అంతా చూస్తున్నాడు. భారత విమానాలు పాకిస్థాన్ గగనతలంలో 21 నిమిషాల పాటు విహరించాయా? మరి 300 మంది చనిపోతే రక్తం ఏదీ అని ప్రశ్నించారు. సరే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చూస్తాం అంటూ కామెంట్ చేశారు. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఇరు దేశాల ప్రజల్లో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: